సమ్మర్ స్ట్రోక్ గురించిన వార్తలు మండువేసవికాలంలో చాలవింటూ ఉంటాం. అయితే ఈచలికాలంలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు  నాగార్జున నుండి ఊహించని స్ట్రోక్ తగిలింది అన్నగాసిప్పులు ఇప్పడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు ఇప్పటికే టాలీవుడ్ సెన్సేషన్ అనిపించుకోవాల్సిన అదృష్టం రెండుసార్లు కలిసి వచ్చింది.  తొలిసినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’ తో బ్లాక్ బస్టర్ ను అందించి నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. 

అదిచాలదు అన్నట్లుగా  ఈఏడాది వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కూడా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా నాగచైతన్య క్రేజ్ ను మరింత పెంచడానికి  సహకరించింది. అయితే ఈరెండు సినిమాల సక్సస్ క్రెడిట్ అంతా నాగార్జున ఖాతాలోకే వెళ్లిపోయిందికాని దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు పెద్దగా కలిసిరాలేదు అన్నకామెంట్స్ ఇప్పటికే చాలమంది చేస్తున్నారు. ‘సోగ్గాడే’ చిత్రానికి ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ తీసేందుకు రకరకాల వెర్షన్స్ ను నాగ్ కు వినిపించినా అవి నాగార్జునకు నచ్చక పోవడంతో అవి వర్కవుట్ కాలేదు. దీనితో ఇప్పుడు రవితేజ హీరోగా ఒక సినిమాను తీసేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు కళ్యాణ్ కృష్ణ.  

వాస్తవానికి ఈసినిమా షూటింగ్ ఇవాళే ప్రారంభంకావాల్సి ఉన్న నేపధ్యంలో ఈమూవీ  ముహూర్తం షాట్ పిక్చరైజ్ చేసేందుకు ఏర్పాట్లను కూడ కళ్యాణ్ కృష్ణ చేసుకున్నట్లు వార్తలు కూడ వచ్చాయి. అయితే ఇప్పుడీ మూవీ సినిమా ఆగిపోయింది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనికికారణం నాగార్జున అని అంటూ మరికొందరు  గాసిప్పులను ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈగాసిప్పుల ప్రకారం గతంలో నాగార్జున కళ్యాణ్ కృష్ణతో చేసుకున్న ఒప్పందాన్ని బేస్ చేసుకుని కళ్యాణ్ కృష్ణ ప్రయత్నాలకు బ్రేక్ వేసినట్లు టాక్. 

‘సోగ్గాడే చిన్ని నాయన’ మూవీ రిలీజ్ కి ముందే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వరుసగా మూడు చిత్రాలను తెరకెక్కించేందుకు కళ్యాణ్ కృష్ణ  నాగార్జున ఒప్పందం చేసుకున్నాడట. ఇప్పుడు ఆకాంట్రాక్ట్ పూర్తి కాకుండా మరో ప్రజెక్టు పై ఈదర్శకుడు వర్క్ చేసేందుకు నాగ్ కు ఇష్టం లేదని అందుకే సున్నితంగా నాగార్జున ఈబ్రేక్ వేసాడు అనిఅంటున్నారు.    దీనికితోడు ‘బంగార్రాజు’ ప్రారంభం ఎప్పుడో కళ్యాణ కృష్ణకే తెలియని పరిస్థితి. ఇలాంటిపరిస్థితుల్లో కళ్యాణ్ కృష్ణ ఫ్యూచర్ ఏమిటి అన్నచర్చలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి. ఏమైనా వరస విజయాలను ఇచ్చే సినిమాలను తీసాక కూడ కళ్యాణ్ కృష్ణకు ఇంకా అదృష్టం కలిసిరావడం లేదు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: