మన హీరోలు నటించే సినిమాల గురించే కాకుండా వారి వ్యక్తిగత జీవితాల గురించి అదేవిధంగా వారి డ్రెసింగ్ స్టైల్ గురించి జనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. అటువంటి సందర్భమే ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు కూడ ఎదురౌతోంది. మెగా స్టార్ చిరంజీవి పోలికలు మాత్రమే కాకుండా తన సినిమాలకు సంబంధించి చిరంజీవి పాటలను ఎన్నో సార్లు తన సినిమాలలో రీమిక్స్ చేసిన తేజు ఇప్పుడు తన డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో కూడ తన మేనమామ పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. 

ఈమధ్య విడుదలైన ‘జవాన్’ సినిమా ప్రమోషన్ లో తేజు అనుసరించిన డ్రెస్సింగ్ స్టైల్ ఈ సందేహాలకు తావు ఇస్తోంది. ‘జవాన్’ మూవీ ఏమేరకు సక్సస్ అయింది అన్న విషయాన్ని పక్కకు పెడితే నటుడుగా తేజుకు ఈసినిమా మంచి పేరు తీసుకు వచ్చింది. ఈసినిమాను ఎట్టి పరిస్తుతులలోను హిట్ చేయాలి అన్న పట్టుదలతో తేజు ఈసినిమా ప్రమోషన్ ను చాల గట్టిగా చేసిన విషయం తెలిసిందే. 

ఈమధ్య సాయి ధరమ్ బయటకు వస్తేచాలు ఒకే స్టైల్ కాస్త్యుమ్స్ తో దర్శనం ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా కుర్తా అండ్ ప్లెయిన్ ప్యాంట్ తోనే వెళుతున్నాడు. గత వారం ‘జవాన్’ ప్రమోషన్స్ లో కూడ ఇదే కాస్ట్యూమ్ ని సెట్ చేసుకున్నాడు. అంతేకాదు ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా అదే  తరహాలో డ్రెస్ చేసుకుని వచ్చాడు. ‘జవాన్’  సినిమాలో ఆ లుక్ లో ఉండటంతో అలా వచ్చాడు అనుకున్నా అటువంటి డ్రెస్ ‘జవాన్’ లో ఎక్కడా వేసుకోలేదు. 

దీనితో తేజు పవన్ కళ్యాణ్ డ్రస్ స్టైల్ ను అనుసరిస్తున్నాడు అంటూ కామెంట్స్ పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎక్కువగా బయటకి వచ్చినపుడు ఇలాంటి దుస్తుల్లోనే కనిపిస్తాడు. అదేవిధంగా రామ్ చరణ్ కూడా ఎక్కువగా ఇదే స్టైల్ లో ఇప్పుడు బయట దర్శనం ఇస్తున్నాడు. దీనితో తేజు తాను బయట కనిపిస్తే చాలు తాను పవన్ మేనల్లుడుని అని మళ్ళీమళ్ళీ జనానికి గుర్తుకు చేసే విధంగా తేజు ఇలాంటి డ్రెస్ స్టయిల్ మెయిన్ టైన్ చేస్తున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: