పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో అప్పట్లో వచ్చిన అత్తారింటికి దారేది బాక్సాఫీస్ దగ్గర చేసిన  ప్రభంజనం, సృష్టించిన రికార్డులు విషయం మనకందరికీ తెలుసు, సినిమా విడుదల కాకముందే  ఫస్ట్ హాఫ్  బయటకొచ్చినా  కానీ ఏమాత్రం దాని ప్రభావం కనబడకుండా అప్పటి దాక బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న రికార్డులని తుడుచుపేటుకున్ని పోయేలా చేసింది  ఈ సినిమా.


అయితే ఇప్పుడు మరొకసారి బాక్సాఫీస్ దగ్గర ‘అజ్ఞాత వాసి’ సినిమాతో వస్తున్నారు వీరిద్దరూ ... ఈ సినిమా కూడా గత సినిమాల రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ముందే లెక్కలు వేసుకుంటున్నారు ట్రేడ్ పండితులు .. ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమాని ఏకంగా 209 లొకేష‌న్ల‌లో విడుద‌ల చేస్తున్నారు.



ఓ భార‌తీయ చిత్రం ఇన్ని చోట్ల విడుద‌ల కావ‌డం ఇదే తొలిసారి. బాహుబ‌లి 2 – 126 కేంద్రాల్లో విడుద‌లైతే, ఖైది నెం.150… 74 లొకేష‌న్ల‌లో విడుద‌లైంది. క‌బాలి 73 లొకేష‌న్ల‌కే ప‌రిమితం, దంగ‌ల్ 69 కేంద్రాల్లో విడుద‌లైంది. త్రివిక్రమ్ సినిమాలకి ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఉంది. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది  ‘అజ్ఞాత‌వాసి’ ఏ స్థాయి వ‌సూళ్లు అందుకుంటుందో, ఎన్ని రికార్డులు బ‌ద్దలు కొడుతుందో చూడాలి.



అతే ఎంత సాధించినా బాహుబలి 2 ఓవర్ సీస్ రికార్డులు కొట్టడం మాత్రం అసాధ్యం అంటున్నారు. ఎంత సాధించినా మాగ్జిమం నాలుగు మిలియన్ డాలర్ల వరకూ లాగచ్చు అది కూడా సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే లేదంటే కష్టమే .. అయితే బాహుబలి మాత్రం ఇరవై మిలియన్ డాలర్ల పైనే సంపాదించింది. సో ఎన్ని లొకేషన్ లు ఇచ్చినా ఎంత హడావిడి చేసినా ఏ హీరో అయినా ఏ డైరెక్టర్ అయినా జక్కన్న రేంజ్ ని అందుకోవడం ప్రశ్నార్ధకం !


మరింత సమాచారం తెలుసుకోండి: