మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా’ షూటింగ్ ఈరోజు ఉదయం 7.30 నిముషాలకు ప్రారంభం అయింది. అనేక హిట్ సినిమాలకు సంబంధించి గతంలో షూటింగ్ నిర్వహించిన హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన తొలి షాట్ తీసారు. ఈ తొలి షాట్ ను చిరంజీవి కేరెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీల పై చిత్రీకరించారు. 

అయితే షూటింగ్ ఉదయం 7.30 నిముషాలు అనుకుంటే ఆ సమయానికి ఐదు నిముషాల ముందు చిరంజీవి ‘సైరా’ కోసం నిర్మించిన ప్రత్యేకమైన సెట్ లోకి అడుగు పెట్టి తన కమిట్ మింట్ ను చూపెడుతూ యూనిట్ సభ్యులకు ఆశ్చర్యాన్ని కలిగించిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు సురేంద్రరెడ్డి మరో పదిరోజులపాటు ఇదే సెట్ లో చిత్రీకరించబోతున్నారు. 

అనేకమంది విదేశీ ఆర్టిస్టులు కూడ బ్రిటీష్ సైనికుల గెటప్ లో ఈ షూటింగ్ స్పాట్ లో హడావిడి చేస్తున్నట్లు టాక్. ముఖ్యంగా కొన్ని పోరాట దృశ్యాలను ఈ పదిరోజులపాటు జరిగే షూటింగ్ లో చిత్రీకరిస్తారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈమూవీకి సంబంధించి ఇది ఒక టెస్ట్ ట్రయిల్ అని అంటున్నారు.

ఈపదిరోజులపాటు జరిగే షూటింగ్ ఫుటేజ్ ని పరిశీలించిన తరువాత చిరంజీవి లుక్ లో అవసరం అనుకుంటే కొన్ని మార్పులు చేస్తారని తెలుస్తోంది. ఈమూవీకి సంగీత దర్శకత్వం వహించవలసిన రెహమాన్ ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో కీరవాణి ‘సైరా’ సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహించే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 2019 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈసినిమా ‘బాహుబలి’ తెలుగు వెర్షన్ రికార్డులను బ్రేక్ చేస్తుంది అన్న అంచనాలలో మెగా అభిమానులు ఉన్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: