ఈరోజు విశాఖపట్నం వచ్చిన పవన్ డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రేవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇస్తూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాను ఎంత నిజాయితీ పరుడునో చెప్పడానికి మాటలు సరిపోవు అని కామెంట్ చేసాడు. తన సొంత కుటుంబాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చినవాడ్ని అని అంటూ తాను ఎవ్వడినీ లెక్కచేయను అని చెపుతూ రాజకీయ పార్టీలను రాజకీయ నాయకులను టార్గెట్ చేసాడు. 
వాళ్లలా తప్పించుకోలేనని బీజేపీ, టీడీపీ ఎంపీలకు
తాను ఏ పార్టీని ఏ ప్రభుత్వాన్ని ఏమీ అడగను అంటూ తెగేసి చెప్పాడు పవన్. అంతేకాదు తాను పదవుల కోసం ప్రాపకాల కోసం లాబీయింగ్ చేయను అంటూ  ‘ఏం పీకుతారో పీకండి కోడిగుడ్డు మీద ఈకలు పీకితే నేను ఏది పీకాలో అదే పీకుతాను’ అంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరించాడు పవన్ కళ్యాణ్. ఈరోజు ఉదయం 9 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఇది బాధ కలిగించింది, ఓటు అడిగే హక్కు లేదు
ఇదే సందర్భంలో పవన్ మాట్లాడుతూ తాను ఏ పార్టీలకు అయితే మద్దతిచ్చాడో ఆపార్టీలు ప్రజా వ్యతిరేక పాలన చేస్తే వాటిని ప్రశ్నించేందుకు వెనుకాడనని అంటూ సమస్యలను పరిష్కరించలేకపోతే బీజేపీ టీడీపీలకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు పవన్. రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లైనా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాకపోవడం దురదృష్టం అని అంటూ తాను టీడీపీ లేదా బీజేపీ పక్షం కాదని ప్రజా పక్షమని చెపుతూ జనానికి జోష్ ను పెంచాడు. తనకు ధైర్యం, పోరాడే శక్తి ఉంది అని చెపుతూ జనం కోసం అవసరమైతే జైలుకు వెళ్తానని ఇంకా అవసరమైతే లాఠీ దెబ్బలు తింటానని చెపుతూ తనవి ప్రాణాలు కావని పిడికెడు మట్టి మాత్రమేనని అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు పవన్. 
 సీఎం సీఎం నినాదాలతో అసహనం
తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని చెపుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రశ్నించడానికి అధికారం అక్కరలేదు అన్న మాటలు పవన్ నోటివెంట ఉద్వేగంగా వచ్చాయి.  ఒక దేశం సంపద ఖనిజాలు, నదులు, అరణ్యాలు కాదని, కలల ఖనిజాలతో చేసిన యువత అని, వారే దేశ భవిష్యత్తుకు నావికులు అని మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పినమాటలు స్మరిస్తూ పవన్ ఆవేశంగా ఉద్వేగంగా చేసిన ఉపన్యాసం ఆ సమావేశానికి వచ్చిన వేలాదిమంది పవన్ అభిమానులను చైతన్య పరిచింది. అయితే పవన్ ఇదే స్పీడ్ కొనసాగిస్తూ ఈ శంఖారావం కొనసాగిస్తాడా లేదంటే ‘అజ్ఞాతవాసి’ తరువాత మరొక సినిమాను చేసుకుంటూ మళ్ళీ మౌనముద్రలోకి వెళ్ళిపోతాడా అన్న విషయాలు రానున్న కాలంలో తెలుస్తాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: