తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.  హీరోగా మంచి హవా కొనసాగిస్తున్న సమయంలో ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.  అయితే రాజకీయాల్లో అనుకున్న స్థాయిలో రాణించలేక పోయారు చిరంజీవి.  పార్టీ పెట్టిన కొంత కాలానికి కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు నిర్వహించారు.  దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆయన మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్దమయ్యారు.

మొత్తానికి దానికి తుదిరూపం వచ్చి మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో నటించారు.  అప్పటి వరకు చిరు పై ఉన్న రూమర్లు..అభిప్రాయాలు ఈ సినిమాతో పటా పంచలయ్యాయి.  చిరంజీవిలో ఏమాత్రం స్టామినా...పవర్ తగ్గలేదని ఆయన పది సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో..ఇప్పుడూ అలాగే ఉన్నారని అభిమానులు ఖుషీ అయ్యారు. 

ఇప్పుడు చిరు 151 వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు మొదలయ్యింది.  ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఓ ట్వీట్ చేశాడు.

‘ ‘సైరా’ మొదలైంది. గొప్ప టీమ్ ను కలిగి ఉండేలా మా నాన్న, నేను ఆశీర్వదించబడ్డాం. ఈ చిత్ర నిర్మాణం ఓ మధురమైన జ్ఞాపకంగా మాకు మిగిలిపోతుంది’ అని రామ్ చరణ్ పేర్కొన్నాడు. ‘సైరా’ షూటింగ్ ఫొటోలను ఈ సందర్భంగా చరణ్ పోస్ట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: