భారతీయ సినిమా ఇండస్ట్రీలో విశ్వనటుడు కమల్ హాసన్ ఈ మద్య సినిమాలు తగ్గించి రాజకీయాలు ఎక్కువ మాట్లాడుతున్నారు.  గత కొంత కాలంగా ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నో సంచలనాలు సృష్టించాయి.  తమిళంలో బిగ్ బాస్ షో చేసే సమయంలో కూడా కొన్ని వివాదాలు చెలరేగాయి.  ఇక సినిమా పరంగా కాకుండా ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి.  మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నటి సారికను పెళ్లిచేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు..శృతి హాసన్, అక్షర హాసన్.  తర్వాత సారికతో విడిపోయిన తర్వాత గౌతమితో చాలా ఏళ్లు సహజీవనం చేశాడు. 

Kamal-Shruthi Hassan Latest Photos

ఈ మద్య వీరూ విడిపోయారు..ప్రస్తుతం కమల్ హాసన్ తమిళనాడు రాజకీయాలపైపు అడుగులు వేస్తున్నారు.  ఇండస్ట్రీలో ఈ మద్య స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్న తరుణంలో కమల్ కూతుళ్లు శృతి, అక్షరలు కూడా హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చారు.  ప్రస్తుతం శృతి హాసన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి ఫామ్ లో ఉంది.  ఇక లండన్ లో సెటిలైన ఇటాలియన్ మైఖేల్ కొర్సేల్ ను శ్రుతి హాసన్ వివాహం చేసుకోబోతోందనే వార్తలు గత కొన్నాళ్లుగా వస్తున్న సంగతి తెలిసిందే. 

Kamal-Shruthi Hassan Latest Photos

తరచూ అతడితో కలిసి కనిపిస్తూ.. పెళ్లి ఊహాగానాలకు ఊతం ఇస్తోందామె. ఆ మధ్య అతడిని కలవడానికి లండన్ వెళ్లింది. లండన్ లో కమల్, మైఖేల్ లను కలిపింది శ్రుతి. తాజాగా మల్ పట్టు పంచెలో కనిపించగా, మైఖేల్ కూడా అచ్చమైన తమిళ వస్త్రధారణలోకి మారిపోయాడు. శ్రుతి శారీ కట్టి.. ట్రెడిషినల్ టచ్ ఇచ్చింది. త్వరలో మరి కమల్ ఇంట్లో పెళ్లి భాజా మోగనుందేమో అని అభిమానులు అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: