తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి తనదైన ముద్రవేశారు ఏఆర్ మురుగదాస్.  తెలుగులో జ‌ర్నీ, గ‌జినీ, స్టాలిన్ వంటి సినిమాల‌తో అల‌రించిన మురుగ త‌మిళంలో విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించాడు. ఇవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాన్ని అందుకున్నాయి.  తమిళనాడు లోని సేలం దగ్గర్లోని కళ్లకురిచ్చి అనే పల్లెటూర్లో జన్మించాడు. ఇంటర్ వరకు సొంత  ఊర్లో చదివాడు. బీయే కోసం తిరుచ్చి వెళ్ళాడు. కాలేజీలో ఏ సాంస్కృతిక ప్రదర్శనలు జరిగినా ముందుండేవాడు. అక్కడ చదువుతున్నప్పుడు సినిమాలు చూడ్డం పెరిగి, సినిమాల్లో ప్రయత్నించాలనే కోరిక ఎక్కువైంది.
Image result for ar murugadoss rare photos
కలైమణి అనే తమిళ రచయిత దగ్గర కాపీ రైటర్‌గా చేరాడు. కొన్నాళ్ల తరువాత దర్శకత్వం మీద మోజు పుట్టింది. దాంతో అమృతం అనే దర్శకుణ్ణి ఆశ్రయించాడు. దాదాపు పది సంవత్సరాల అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూ ఎన్నో మెలుకువలు నేర్చుకున్నాడు.   తరువాత సినిమా రమణ (తమిళం). సూపర్‌హిట్‌. దాన్ని తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా ఠాగూర్‌ (సినిమా)గా రీమేక్‌ చేయగా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 
Image result for ar murugadoss rare photos
షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఆధారంగా సూర్య నాయకుడిగా గజినీ సినిమా తీశాడు. అది కూడా తెలుగు తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. దాంతో బాలీవుడ్ లో అదే సినిమాని ఆమిర్ ఖాన్ తో తీసే అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం మహేష్ బాబు తో ‘స్పైడర్’ చిత్రాన్ని తెరకెక్కించారు కానీ పెద్దగా హిట్ కాలేదు. 
Image result for ar murugadoss rare photos
త్వ‌ర‌లో విజ‌య్ 62వ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్నాడు.స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం భారీ బ‌డ్జెట్ మూవీగా ఉంటుంద‌ని స‌మాచారం. అయితే తాజాగా మురుగ‌దాస్ ఫ్యామిలీకి సంబంధించిన ఓ పిక్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ముచ్చ‌ట‌గొలుపుతున్న మురుగదాస్ ఫ్యామిలీ పిక్‌పై చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: