ఈ మద్య సోషల్ మీడియాలో నటుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ కి సంబంధించి ఏ చిన్న విషయం అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది.  దీంతో కొంత మంది పవన్ కళ్యాన్ ని టార్గెట్ చేసుకొని పాజిటీవ్ గానో, నెగిటీవ్ గానో కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.  ఇక బుల్లితెరపై ‘బిగ్ బాస్ ’ ప్రోగ్రామ్ తో పరిచయం అయిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఈ మద్య సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు.  సాధారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా తనదైన స్టైల్లో స్పందించి రివ్యూ ఇచ్చే కత్తి మహేష్  ఆ మద్య పవన్ కళ్యాన్ రాజకీయాలపై కామెంట్ చేశారు. 
Image result for pawan katti mahesh
అంతే మరుసటి రోజు పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా బండ బూతులు తిడుతూ ఆడుకున్నారు.  కొంత మంది ఏకంగా చంపేస్తామని బెదిరించారు.  దీంతో మనోడు వివిధ చానల్స్ లో తన గోడు విన్నవించుకున్నాడు.  తాజాగా మరోసారి పవన్ కళ్యాన్ పై సెటైర్లు వేశారు కత్తి మహేష్.  నిన్న పవన్ కళ్యాన్ విశాఖలో పర్యటించిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా కత్తి మహేష్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలని కామెంట్ చేశాడు. 
Image result for pawan katti mahesh
తాజాగా దీనిపై స్పందించిన  నిర్మాత బన్నీ వాసు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. "పవన్ కల్యాణ్ ఫ్యాన్స్... మార్కెట్ లో 'కత్తి'లు, 'సుత్తి'లు ఉంటాయి. వాటిని పట్టించుకోద్దు" అని అన్నాడు. అయితే పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించిన వేళ, తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని మోసం చేసిన వారిని వదిలేది లేదని హెచ్చరించగా, కత్తి మహేష్ స్పందించిన సంగతి తెలిసిందే.
Image result for pawan speech vizag
తన కులాన్ని, ప్రజలను మోసం చేసిన చిరంజీవి సంగతేంటని కత్తి మహేష్ ప్రశ్నించాడు. దీనిపై ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మరోసారి కత్తి మహేష్ ని దుమ్ముదులిపే కార్యక్రమంలో ఉన్నట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: