టాలీవుడ్ కింగ్ నాగార్జున ఏవిషయం పై అయినా ఎటువంటి ఆవేశాన్ని ప్రదర్శించకుండా చాలా కూల్ గా డీల్ చేస్తాడు. ఈవ్యవహారశైలి వల్లనే నాగ్ టాప్ బిజినెస్ మాన్ గా కూడా ఎదిగిపోయాడు. దీనికితోడు నాగ్ అంత త్వరగా తనమనసులోని అభిప్రాయాలను బయటపెట్టడు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యంగా  మీడియాతో కూర్చుంటే  నాగార్జున ఎటువంటి ప్రశ్నకైనా చాలా స్వీట్ గా ఆన్సర్ ఇవ్వడం అతడి స్టైల్. 

ఇలాంటి పరిస్థితులలో నాగార్జున చాలా వ్యూహాత్మకంగా హీరో నాని పై చేసిన కామెంట్స్ ఇప్పడు హాట్ టాపిక్ గా మారాయి. అఖిల్ మూవీ ‘హలో’ ను ప్రమోట్ చేస్తూ నాగ్ ఈకామెంట్స్ చేసాడు.  ‘హలో’ రిలీజ్ అవుతున్నందుకు కొంచెం టెన్షన్ గానే ఉంది అని చెప్పిన నాగ్ ఆసినిమా మీద మాత్రం చాలనమ్మకం ఉందని అందరికి నచ్చుతుంది అనేనమ్మకం తనకు ఉందని అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ‘హలో’ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోన్న నేపధ్యంలో నాని ‘ఎంసిఎ’ కూడా ఒకరోజు ముందుగా రిలీజ్ కాబోతోంది. 

దీనితో ‘హలో’ కి  ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ? అన్నప్రశ్నకు నాగ్ చాలా కూల్ గా ఆన్సర్  ఇచ్చాడు. నాని సినిమా తమ ‘హలో’ కు ఏమాత్రం పోటీకాదు అని చెపుతూ ఒకవివరణ కూడా ఇచ్చాడు. అఖిల్ ‘హలో’ కు నాని ‘ఎంసిఏ’ ఏ విషయంలోనూ సంబంధంలేని సినిమాలు. అదీకాకుండా నాని చాల పాపులర్ హీరో. సంక్రాంతి పండక్కి అయిదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పోటీ అని ఎవరు అనుకోవడంలేదు. 

అల్లాగే తాను నాని సినిమా విషయంలోను ఇలాగే అభిప్రాయ పడుతున్నాను అంటూ ఆశక్తికర కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో నాగ్ మాట్లాడుతూ మన తెలుగురాష్ట్రాలలో సరిపోయే థియేటర్స్ చాలా ఉన్న నేపధ్యంలో అఖిల్ ‘హలో’ కు నాని ‘ఎంసిఎ’ కు పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు అంటూ తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకున్నాడు నాగ్. దీనితో కొందరు మీడియా ప్రతినిధులు నాగ్ సింపుల్ గా నాని పోటీకాదు అని వ్యూహాత్మకంగా కామెంట్ చేసాడు అని తమలో తాము గుసగుసలు ఆడుకున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: