బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ బోని కపూర్ మొదటి భార్య తనయుడు అర్జున్ కపూర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన అర్జున్ కపూర్ తాజగా  ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ లో నటిస్తున్నాడు.  ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని పితోరాఘడ్ పరిసర ప్రాంతాల్లో షూట్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ ఉత్తరాఖండ్‌లోని ఫింథోర్‌ఘడ్‌లో జరుపుకుంటోంది.
Image result for arjun kapoor drunk man attack
ఈ క్రమంలో కమల్‌ కుమార్‌ అనే ఓ డ్రైవర్‌ సెట్స్ లోకి వచ్చాడు. వానిటీ వ్యాన్‌ దగ్గర అర్జున్‌ ను కలిసి షేక్‌ హ్యాండ్‌ కోరాడు. ఆపై అతని చెయ్యిని మెలితిప్పటం ప్రారంభించాడు. అంతలోనే దాడికి యత్నించాడు..దీన్ని గమనించిన చిత్ర యూనిట్ వెంటనే కమల్ ని అడ్డుకున్నారు. ఆ సమయంలో అతను దురుసుగా మాట్లాడుతున్నాడట.   ఊహించని పరిణామానికి అర్జున్ కపూర్ ఒక్కసారే షాక్ కి గురయ్యాడట.

ఈ ఘటనలో అర్జున్‌ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కాగా, దాడి చేయటంతోపాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ నేరం కింద అతనికి శిక్ష పడనుంది.  అతడి డ్రైవింగ్ లైసెన్సుని రద్దు చేస్తామని ట్రాన్స్‌పోర్ట్ అధికారులు చెబుతున్నమాట. ఇదిలా ఉంటే దిబకర్‌ బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌ వచ్చే ఏడాది ఆగష్టు 18న విడుదల కానుంది. ఇందులో అర్జున్‌ ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: