పవన్ కళ్యాణ్.. అలియాస్ పికె.. ప్రస్తుతం ఈ పేరు వినిపించినా సరే యువత ఉరుము వేగంతో పరుగెడుతున్నారు. ఇక మెగా అభిమానులు.. పవర్ స్టార్ అభిమానుల సంగతి సరేసరి. కేవలం సినిమాలో తన స్టైల్ తోనే అభిమానులను సంపాదించడమే కాదు తన సహృదయంతో ఎంతోమందికి దగ్గరవుతున్నాడు. రీల్ పై చూపించే హీరోయిజం రియల్ లైఫ్ లో చూపించేందుకే వచ్చాడు జనసేన అంటూ ప్రజల్లోకి.

రీల్ పై చూపించే హీరోయిజం రియల్ లైఫ్ లో చూపించేందుకే


పవన్ కళ్యాణ్ జనసేన 2019 ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియదు కాని తన తూటాల్లాంటి మాటలతో మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. పవన్ మీటింగ్ అంటే చాలు పరుగెత్తుకుంటూ యువత పాల్గొంటున్నారు. పవన్ ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు కాదు.. పవన్ చేస్తాడు అన్న ఒక్క నమ్మకంతో ఆయన వెంట ఉంటున్నారు.


సినిమాల్లో డైలాగుల్లా కాదు వాటిని చేసి చూపించే పనితనం ఉన్న నాయకుడిగా 


సినిమాల్లో డైలాగుల్లా కాదు వాటిని చేసిన్ చూపించే పనితనం ఉన్న నాయకుడిగా అభిమానులు ఆయన్ని నమ్ముతున్నారు. అందుకే పవన్ వెంటన్ జనం వస్తున్నారు. ఈమధ్యనే తెలుగు రెండు రాష్ట్రాల్లో చలోరే చలోరే చల్ అంటూ రెండు ప్రభుత్వాలను అడిగి.. కడిగి పారేస్తున్న పవన్ ప్రత్యక్ష రాజకీయం మొదలు పెట్టాడని తెలుస్తుంది.  


పదవే ఆశిస్తే.. 2014 లోనే గెలిచే వాడిని అన్న మాట జనాల్లోకి బాగా వెళ్తుంది. సమస్యకైతే నేను ఎదురెళ్తా.. నేను ఉన్నది సమాజసేవ కోసమే.. అందరికి ఒకే విధమైన న్యాయం.. కుల మత సామరస్యమే తన ధ్యేయం


పదవే ఆశిస్తే.. 2014 లోనే గెలిచే వాడిని అన్న మాట జనాల్లోకి బాగా వెళ్తుంది. సమస్యకైతే నేను ఎదురెళ్తా.. నేను ఉన్నది సమాజసేవ కోసమే.. అందరికి ఒకే విధమైన న్యాయం.. కుల మత సామరస్యమే తన ధ్యేయం అంటున్న పవన్ పరిచయమే అవసరం లేని ఓ మహాశక్తిగా ఎదుగుతున్నాడు అన్నది అందరు గమనిస్తున్న విషయం.



మరింత సమాచారం తెలుసుకోండి: