తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన సుమంత్ ‘ప్రేమకథ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత వచ్చిన గోదావరి, గోల్కొండ హై స్కూల్ లాంటి సినిమాలు తప్ప ఏ చిత్రం మంచి విజయం సాధించలేదు.  తొలినాళ్లలో వరసపెట్టి సినిమాలు చేసిన ఈ హీరో.. ఆ తరవాత వేగం తగ్గించాడు. దీనికి తోడు పరాజయాలు కూడా ఆయన్ని దెబ్బకొట్టాయి. గతేడాది సుమంత్ నటించిన ‘నరుడా డోనరుడా’ చిత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.
Image result for akanksha singh malli raava
ఇండస్ట్రీకి మనోడు ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ పందొమ్మిది సంవత్సరాలు అయ్యింది.  సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సుమంత్ తాజాగా ‘మళ్ళీరావా...’చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చాడు.  ఈ సినిమా ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇక కథ విషయానికి వస్తే..చిన్న తనంలో తన క్లాస్ మెట్ ని ఎంతగానో ప్రేమించిన ఓ కుర్రాడు ఆ విషయం ఇంట్లో తెలిసి వార్నింగ్ ఇస్తారు.  అంతే కాదు ఆ ఊరి నుంచి అమ్మాయి ఫ్యామిలీ దూరంగా వెళ్లి పోతారు.   మళ్లీ 13 ఏళ్ల తరువాత ఓ పని నిమిత్తం కార్తీక్ ఉద్యోగం చేస్తున్న ఆఫీస్‌‌కు అంజలి వస్తుంది.
Image result for akanksha singh malli raava
ఆమెను గుర్తుపట్టిన కార్తీక్ మరోసారి తన ప్రేమను గెలిపించుకోవాలని అనుకుంటాడు.  ఆ అమ్మాయి హృదయాన్ని గెల్చుకుంటాడు..పెళ్లి దాకా వచ్చిన మ్యాటర్ మళ్లీ వాయిదా పడుతుంది..తాను ప్రేమించిన అమ్మాయి మళ్లీ దూరం అవుతుంది. మళ్ళీ కొన్నాళ్ళకు తానె స్వయంగా కార్తిక్ ను వెతుక్కుంటూ వస్తుంది. అసలు అంజలి ఆఖరు నిముషంలో పెళ్లి వద్దని కార్తిక్ ను వదిలి ఎందుకు వెళ్ళిపోయిందీ అన్నదే సినిమా..ఇక కార్తీక్ గా సుమంత్ చాలా అద్భుతంగా నటించాడు. 
Image result for akanksha singh malli raava
ప్రేమ కథను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కొత్తగా చూపించిన విధానమే ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్.  అయితే సినిమాలో హీరోయిన్ వెళ్లడం..మళ్లీ రావడం..ముఖ్యంగా హీరోయిన్ హీరోని వదిలి వెళ్లిపోయే సందర్భం, చివర్లో అతనికి సంజాయిషీ చెప్పుకునే సందర్భం భావోద్వేగపూరితంగా ఉండి టచ్ చేస్తాయి.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రేమ కథను కొత్త కోణంలో చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరాయి. నరేష్ సినిమాటోగ్రఫీ కూడా హడావుడి లేకుండా బాగుంది. మొత్తం మీద చెప్పాలంటే మళ్ళీ చూడాలనిపించేలా ఉన్న ఈ చిత్రం యువతకు కనెక్ట్ అయ్యేలా ఉందట. చాలా కాలం తర్వాత సుమంత్ ‘మళ్లీ రావా’ హిట్టా..ఫట్టా అన్న విషయం రేపటి వరకు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: