IMDB Indian Top Ten stars list released కోసం చిత్ర ఫలితం

రాజమౌళి సినిమా బాహుబలి -2 లో మనం సానుభూతి చూపవలసిన పాత్ర అవంతిక ప్లైడ్ బై తమన్నా. పచ్చబొట్టెసి చెప్పిన సౌందర్యం. మహెంద్ర బాహుబలి పట్టపు రాణిగా ఒక్క నిముషమైనా చూపించినా తృప్తి పడి ఉండేది. రాజమౌళి అలక్ష్యం చేసి నా ఐఎండిబి విడుదల చేసిన  పాపులారిటి పొందిన నటీనటుల్లో జాబితాలో తొలి మూడు రాంకుల్లో ఖాన్-త్రయం పొందగా నాలుగవ రాంక్ మన తమన్నాకే వచ్చింది. ఈ లిష్ట్ లో ఆరో రాంక్ ప్రభాస్ ఎనిమిదో రాంక్ అనుష్కా షెట్టికి లభించాయి. 

anushka shetty కోసం చిత్ర ఫలితం

ఏడాది కాలం లో సినిమా హీరోలు, హీరోయిన్లకు వచ్చిన క్రేజ్, స్టార్‌డమ్ ఆధారంగా "ఇంటర్నెట్ మూవీ డేటా బేస్" ర్యాంకుల ను కేటాయిస్తుంది. 2017 ఏడాదికి గానూ టాప్ 10 జాబితా ను ఐఎండీబీ విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్ ఖాన్త్రయం షారుక్, అమీర్, సల్మాన్‌లు తొలి మూడు స్థానాల్లో నిలవగా అనూహ్యంగా తమన్నాకు నాలుగో స్థానం దక్కింది. 

tamanna bahubali avantika కోసం చిత్ర ఫలితం


బాహుబ‌లి చిత్ర‌ంతో దేశవ్యాప్తంగా పాపులర్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ ఆరో స్థానం, ఆయనకు జోడీగా నటించిన అనుష్క ఎనిమిదో స్థానంలో నిలిచారు. బాహుబలి-2లో త‌మ‌న్నా పాత్ర‌కి పెద్ద‌ ప్రాధాన్యత లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆమె నాలుగో స్థానంలో నిల‌వ‌డం విశేషం. బాహుబలి లో నటించిన ముగ్గురు నటీనటులు టాప్-10 లో చోటు దక్కించుకుని ద‌క్షిణాది సినిమా సత్తాను చాటారు.

సంబంధిత చిత్రం

ఐదోస్థానంలో ఇర్ఫాన్ ఖాన్, ఏడో స్థానంలో అనుష్కశ‌ర్మ‌, తొమ్మిదోస్థానంలో హృతిక్ రోష‌న్‌, ప‌దోస్థానంలో క‌త్రినా కైఫ్ నిలిచారు. ఈ ఏడాది షారుక్‌ఖాన్ నటించిన రయీస్, జబ్ హారే మెట్ సెజల్ చిత్రాలు విడుదలైనా అంతగా ఆకట్టుకోలేదు, కానీ కింగ్ ఖాన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
సంబంధిత చిత్రం


అలాగే అమీర్ ఖాన్ చిత్రాలు విడుదల కాకపోయినా, సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రంలో ఆయన తళుక్కు న మెరిశారు. అంతేకాదు 2016లో ఘన విజయం సాధించిన దంగల్ చిత్రం, ఈ ఏడాది చైనా లో విడుదలై రికార్డుస్థాయి కలెక్షన్లు సాధించింది. 

khan trio కోసం చిత్ర ఫలితం

సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్‌లైట్’ అంతగా మెప్పించకపోయినా, టైగర్ జిందా హై‌తో ఈ క్రిస్మస్‌కు సందడి చేయనున్నారు. అయితే అక్షయ్ కుమార్‌కు టాప్-10 లో చోటుదక్కపోవడం విశేషం. ఆయన నటించిన జాలీ ఎల్ఎల్‌బీ, నామ్ షబానా, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ చిత్రాలు విడుదలయ్యాయి.

irfan hritik katrina anushka sharma కోసం చిత్ర ఫలితం

ఇదేదో సర్వే ఫలితమో ఐవీఆర్ కార్యక్రమమో కాదు. సాంకేతికంగా నిరూపితమైన నిజం. సోషల్ మీడియాలో అత్యథిక ఫేస్-వ్యూస్ కలిగిన హీరోల జాబితా తయారుచేసింది ప్రముఖ ఆన్-లైన్ డేటా బేస్ సంస్థ ఐఎండీబీ. ఒక నెలలో 250 మిలియన్  ఫేస్-వ్యూస్ ఉన్న ఇండియన్ స్టార్స్ ను మాత్రమే తీసుకొని టాప్-10 లిస్ట్ తయారుచేసింది. ఈ లిస్ట్ లో ఆరో స్థానంలో నిలిచాడు ప్రభాస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: