‘బాహుబలి2’ నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ ను పెళ్ళి చేసుకోవడానికి ప్రేమించడానికి ఎందరో హీరోయిన్స్ మరెందరో అమ్మాయిలు రెడీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ ఇప్పటికీ తన మనసులో మాటబయట పెట్టకుండా పెళ్ళి విషయంలో తన సస్పెన్స్ ను కొనసాగిస్తున్నాడు. అలాంటి ప్రభాస్ ఇప్పటికే పెళ్లి అయిపోయిన ఒక బాలీవుడ్ హీరోయిన్ పై విపరీతమైన ప్రేమను పెంచుకున్నాడట. ఈవిషయాన్ని ఆ హీరోయిన్ భర్త ఈమధ్య మీడియాకు సరదాగా లీక్ చేసాడు. 
 బాహుబలి డిస్ట్రిబ్యూషన్
ఇక ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ అంటూ యూత్ ను బాగా ఆకర్షించిన బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్. ఇటీవల ప్రభాస్‌ తోపాటు ‘బాహుబలి’ టీమ్‌ తో ఆమె సమావేశమైన సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ చిత్రాలను ఉత్తరాదిలో రవీనా టాండన్ భర్త అనిల్ తండానీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. 
 రవీనా పాట అంటే ఇష్టం
ఆ తర్వాత అనిల్, ప్రభాస్ మంచి స్నేహితులు అవ్వడంతో ప్రభాస్ సరదాగా తాను ఒకప్పుడు రవీనా టాండన్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న విషయాన్ని బయట పెట్టాడట. అయితే ఇప్పటికీ రవీనా అంటే ప్రభాస్ కు విపరీతమైన అభిమానం ఉండటంతోపాటు ఆమె పాటలు అన్నా ప్రభాస్ కు బాగా ఇష్టం ఉండటంతో రవీనాను ప్రభాస్‌ తో కలిపించేందుకు అనిల్ ఆమె భర్త అనీల్ ఏర్పాటు చేశాడట. 
 సాహో షూటింగ్‌లో
ఆ క్రమంలోనే హైదరాబాద్‌ లో ఒక డిన్నర్ ను ఏర్పాటుచేసి రవీనాను ప్రభాస్ తన ఇంటికి ఆహ్వానించడమే కాకుండా ఆమెచేత అందాజ్ అప్నా అప్నా చిత్రంలో ఎలో జి సనమ్ అనే పాటను అమెతో పాడించుకుని ఆపాటను ఎన్నిసార్లు విన్నానో తనకే తెలియదు అంటూ రావీనాకు షాక్ ఇచ్చాడట. ఈవిషయాలను సరదాగా రానా బయటపెట్టడంతో మీడియాకు లీక్ అయ్యాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: