మెగాభిమానులను ఎప్పటినుండో ఊరిస్తున్న 'రంగస్థలం' ఫస్ట్‌లుక్ వచ్చేసింది. ‘రంగస్థలం’ ఫస్ట్‌లుక్‌ను మైత్రీ మూవీ మేకర్స్ శనివారం రిలీజ్ చేసింది.   పల్లెటూరి కుర్రాడి లుక్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అదిరిపోయారు. ఇందులో చెర్రీ 'చిట్టిబాబు' అనే పాత్రలో కనిపిస్తుండగా, మార్చి 30న థియేటర్లలో చిట్టిబాబును కలుసుకోండంటూ రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీని ఇచ్చేశారు రామ్ చరణ్.
Image result for rangasthalam stills
మాస్ బాడీ లాంగ్వేజ్‌తో పక్కా పల్లెటూరి యువకుడిలా మెగా పవర్ స్టార్ కనిపించారు. ఫస్ట్ లుక్‌తోనే డైరెక్టర్ సుకుమార్ సినిమాపై అంచనాలు పెంచేశారు. 'రంగస్థలం 1985' సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకొంటోంది.వాస్తవానికి రంగస్థలం ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్‌ 8 సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ తొలుత ప్రకటించారు. కానీ అనివార్య కారణాల రీత్యా దాన్ని వాయిదా వేశారు. 
Image result for rangasthalam stills
దీంతో మెగా అభిమానుల్లో అసంతృప్తి కనిపించడంతో.. శనివారం ఉదయం 9 గంటలకు ‘రంగస్థలం 1985’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది.అన్నట్టుగానే శనివారం ఉదయం 9 గంటలకు ‘రంగస్థలం 1985’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  మరి ఆ 'చిట్టిబాబు' లాగే ఈ 'చిట్టిబాబు' కూడా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారేమో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: