టాలీవుడ్ లో ఈ మద్య కుర్ర హీరోలతో జత కడుతూ..మంచి విజయాలు అందుకుంటుంది అందాల భామ మెహ్రీన్.   నేచురల్ స్టార్ నాని తో ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, C/o సూర్య, జవాన్ సినిమాలతో వరుసగా విజయాలు అందుకుంది.  అయితే గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా మంచి మార్కులే కొట్టేస్తుంది మెహ్రీన్.  అంతే కాదు ఆ మద్య ఓ తమిళ సినిమాలో కూడా నటించిన మెహ్రీన్ ఈ మద్య బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 
Image result for mehreen kaur
సాధారణంగా టాలీవుడ్‌లో కాస్త పేరు రాగానే చాలామంది బాలీవుడ్ వైపు చూస్తారు.  ఈ ఏడాది వరుస సినిమాలతో ఆకట్టుకుని, రెండు హిట్లు సాధించిన మెహ్రీన్‌ కౌర్‌.. తనకు బాలీవుడ్‌ కన్నా టాలీవుడే ఎక్కువ అని చెప్పింది. మెహ్రిన్‌కు ఏ ఉద్దేశం ఉందో లేదో తెలీదు కానీ.. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుందా..లేదా అన్నది ఆలోచనలో పడేసింది. 
Related image
 బాలీవుడ్ పై టంగ్ స్లిప్ అయిన ఈ అమ్మడు  తన తప్పు తెలిసి నాలుక కరుచుకుని.. మళ్లీ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ‘‘నటనకు ఏ భాష అయితే ఏమిటి? ఎక్కడైనా పేరు తెచ్చుకోవచ్చు కదా?’’ అంటూ కవరింగ్‌ ఇచ్చుకుంది.  మెహ్రిన్ గతేడాది ‘ఫిల్లౌరి’ అనే హిందీ సినిమాలో నటించింది. అది అంతంత మాత్రంగానే ఆడటంతో అమ్మడికి అక్కడ గుర్తింపు రాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: