టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మారిన మరో కమెడీయన్ సప్తగిరి. మొన్న సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. ఇప్పుడు కామెడీ లాయిర్ గా థియేటర్లలో గారడీ చేస్తున్నాడు. తెలుగులో ఒకవైపు కామెడీతో చేస్తూ.. మరోవైపు హీరోగా ట్రాక్ మార్చాడు సప్తగిరి. మొన్న సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ యమా ఫాస్ట్ గా వచ్చేశాడు. స్టోరీ పరంగా ఎలా ఉన్నా.. ఆన్ స్క్రీన్.. కామెడీని పండించి ఫుల్ మార్క్స్ కొట్టేశాడు.

Image result for sapthagiri llb

సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాలో ఫన్ గారడీతో మార్క్స్ కొట్టేసిన సప్తగిరి.. సాలిడ్ హిట్ కోసం, రెండో ప్రయత్నంగా.. హిందీ లో సూపర్ హిట్ సాధించిన సినిమా ‘జాలీ ఎల్.ఎల్.బి’ ని... ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ గా తెలుగులో రీమేక్ చేసాడు. నవ్వులు పూయించే కామెడీ లాయర్ గా.. కథ నుండి కామెడీ వరకూ జాగ్రత్త తీసుకున్నాడు. టీజర్, ట్రైలర్లతో ఆడియన్స్ లో ఫన్ జనరేట్ చేసిన సప్తగిరి.. ప్రెజెంట్ ఎబవ్ ఏవరేజ్ టాక్ తో దూసుకుపోతున్నాడు.

Image result for sapthagiri llb

టాలీవుడ్ లో సప్తగిరి చేసిన సినిమాలు రెండే.. అయినా హీరోగా తనదైన స్టైల్ లో సత్తా చాటుతున్నాడు. సప్తగిరి ఎల్.ఎల్.బి సినిమాలో ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అయినా.. సెకెండ్ హాఫ్ తో మాత్రం సినీ లవర్స్ ని ఇంప్రెస్ చేశాడు. సో ఓవరాల్ గా చూస్తే, సప్తగిరి హీరోగా మారినా.. తన ఒరిజినల్ కామెడీని వదలకుండా.. అదే స్టైల్ లో కొత్త ప్లేవర్ చూపిస్తున్నాడు.

Image result for sapthagiri llb

గతంలో పలువురు కమెడియన్లు హీరో అవతారమెత్తారు. ఒకసారి హీరో అవతారమెత్తాక మళ్లీ కామెడీ ఎందుకులే అనుకుని ఆ క్యారెక్టర్లవైపు తిరిగి వెళ్లలేకపోయారు. కొంతకాలం తర్వాత హీరో ఛాన్సులు రాకపోవడం, మరోవైపు మళ్లీ కామెడీవైపు వెళ్లేందుకు మనసు అంగీకరించకపోవడంతో స్క్రీన్ కు దూరమైపోయారు. కానీ సప్తగిరి మాత్రం అలాంటి తప్పు చేయనంటున్నాడు. హీరో అయినా కామెడీని మాత్రం వదిలేది లేదంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: