మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘రంగస్థలం’ ఫస్ట్ లుక్ ఈ రోజు ఉదయం రిలీజ్ అయ్యింది.  మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు చాలా స్టైలిష్ గా కనిపిస్తుంటారు. అయితే సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘రంగస్థలం’ సినిమాలో రాంచరణ్ ని చాలా డిఫరెంట్ గా చూపిస్తున్నారు.  ఫస్ట్ లుక్ లో చెర్రీని చూస్తుంటే..అచ్చమైన గ్రామీణ యువకుడి గా కనిపిస్తున్నారు.  గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ తరహాల పల్లెటూరి సినిమాల్లో నటించి మెప్పించారు. 

Image result for rangastalam stills

తాజాగా  'రంగ‌స్థ‌లం' చిట్టిబాబు పాత్ర‌లో చ‌ర‌ణ్ మేకోవ‌ర్‌కి మెగాభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కేవ‌లం ఫ‌స్ట్ లుక్‌తో స‌రిపెట్టుకోకుండా.. మ‌రో రెండు స్టిల్స్ కూడా శ‌నివారం విడుద‌ల చేశారు.  ఈ పోస్టర్లు చూస్తుంటే..పూర్తి స్థాయిలో గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది..అది కూడా 1985 ప్రాంతంలో ఎలా ఉంటూందో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. 

rangasthalam

మొక్క‌జొన్న పొత్తుల‌ను త‌ట్ట‌లో పెట్టుకుని.. పొలంలో దేనినో ఆస‌క్తిగా చూస్తున్న చ‌ర‌ణ్ స్టిల్ ఒక‌టైతే, మ‌రొక‌టేమో.. నీళ్లు తోడే మోటార్ ఇంజ‌న్‌లో స‌మంత డీజిల్ పోస్తుంటే... ఇంజ‌న్ ఎలాంటి ప్రాబ్ల‌మ్స్ లేకుండా వ‌ర్క్ చేయాల‌ని దేవుణ్ణి ప్రార్థిస్తున్న‌ట్లుగా చ‌ర‌ణ్ ఉన్నారు. సుకుమార్ ఎలాంటి శ్ర‌ద్ధ తీసుకున్నాడో స్ప‌ష్టంగా తెలుస్తోంది. 'రంగ‌స్థ‌లం' మార్చి 30న తెర‌పైకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: