కామెడీ కింగ్ గా తెలుగు సినిమా రంగాన్ని మూడు దశాబ్దాలపాటు ప్రభావితం చేసిన బ్రహ్మానందం నటించిన సినిమాలు లేకుండా అసలు సినిమాలే ఉండేవి కావు. టాప్ హీరోలు కూడా తమ సినిమాలలో బ్రహ్మీ పాత్ర ఉండాలని చెప్పి మరీ దర్శకులు చేత క్రియేట్ చేయించుకునే వారు అంటే బ్రహ్మానందం ఎటువంటి హవాను కొనసాగించాడో అర్ధం అవుతుంది. 

అటువంటి బ్రహ్మీ హవా నేడు పూర్తిగా మసకబారి పోయింది. అప్పుడప్పుడు ఈ హాస్య నటుడు కొన్ని సినిమాలలో కనిపిస్తూ ఉన్నా బ్రహ్మీని పట్టించుకునే ప్రేక్షకులే కరువైపోయారు. దీనికితోడు  బ్రహ్మానందం కోసం క్యారెక్టర్లు రాయగల సత్తా కూడా రచయితల్లో తగ్గిపోయింది. దానితో ఇఫ్పుడు వస్తున్న టాప్ హీరోల సినిమాలలో ఎక్కడా బ్రహ్మానందం కనిపించడం లేదు. 

ఇలాంటి పరిస్థుతులలో బ్రహ్మానందంకు ఒక టాప్ హీరో సినిమాలో నటించే అవకాసం వచ్చింది. అది కూడా నందమూరి సింహం బాలకృష్ణ సినిమాలో కాస్త లెంగ్త్ ఎక్కువగా ఉన్న రోల్ కావడంతో ఈమూవీ పై బ్రహ్మానందం చాల ఆసలు పెట్టుకున్నాడు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న బాలయ్య ‘జయసింహా’ మూవీలో బ్రహ్మానందం పాత్రకు సంబంధించిన సినిమా షూట్ కూడ పూర్తయిపోయిది.

అయితే ఈమధ్య ఈసినిమాకు సంబంధించిన సీన్స్ ను ఎడిటింగ్ కేబుల్ దగ్గర చూసిన దర్శక నిర్మాతలు ఈసినిమాలోని  బ్రహ్మీ కామెడీ ట్రాక్ అంతగా పండలేదని పైగా ఈ ట్రాక్ ఈమూవీ కథ కథనాలకు అడ్డం పడుతోందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీనితో ఈ యూనిట్ సభ్యులు అంతా ఆలోచించి ఆఖరికి బ్రహ్మీ ఎపిసోడ్ కు కోత వేస్తే బెటర్ అన్న ఒపీనియన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈవార్తలే నిజం అయితే అసలే సినిమాలు లేక బాధపడుతున్న బ్రహ్మానందంకు ఇది మరో ఊహించని షాక్ అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: