నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా చాలాకాలం క్రిందట వచ్చిన ‘నరసింహ నాయుడు’ బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ముందువరసలో ఉంటుంది. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈమూవీ టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఓ సరికొత్త అధ్యాయం క్రియేట్ చేసింది. ఈమూవీ సక్సస్ తరువాత చాలామంది ఈ తరహా సినిమాలను తీసినా ‘నరసింహనాయుడు’ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోలేదు. 

ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ‘నరసింహనాయుడు' సినిమాకు సంబంధించి కథను అందించిన చిన్నికృష్ణ ఈసినిమాకు సీక్వెల్ కథ రాసుకుని ఈమధ్య బాలకృష్ణకి వినిపించాడట. ఈ కథ బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ చేద్దామని బాలకృష్ణ తన అంగీకారాన్ని తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఉంటుంది అని అంటున్నారు. 

గతంలో టాప్ హీరోల సినిమాలకు చిన్నికృష్ణ ఇచ్చిన కథలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారాయి. అయితే ఇప్పుడు చాలామంది దర్శకులు తమ సినిమాలకు తామే స్క్రిప్ట్ ను వ్రాసుకుంటున్న నేపధ్యంలో చిన్ని కృష్ణ హవా ఈమధ్య బాగా తగ్గింది. అయితే చిన్ని కృష్ణ బాలయ్యకు ఉన్న సాన్నిహిత్యం రీత్యా చిన్నికృష్ణ మాటలకు బాలయ్య బుట్టలో పడిపోయాడు అని అంటున్నారు. 

ఈమధ్య కాలంలో వరసపెట్టి సినిమాలు చేస్తున్న బాలకృష్ణ అనేకమంది ఫెయిల్యూర్ దర్శకులకు చుక్కానిగా మారి వారుచేపుతున్న కథలకు ఓకె చెపుతున్నాడు. ఇప్పుడు అదే లిస్టులో చిన్ని కృష్ణ కూడ చేరిపోయాడ అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుంటే కుదిరితే బాలయ్య ‘నరసింహనాయుడు’ సీక్వెల్ కు చిన్నికృష్ణ దర్శకత్వం వహించే అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు అని అంటున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: