నాగార్జున తన చిన్నకొడుకు అఖిల్ డాన్స్ టాలెంట్ ను అక్కినేని నాగేశ్వరావు డాన్స్ టాలెంట్ తో పోలుస్తూ నాగ్ విశాఖపట్టణంలో జరిగిన ‘హలో’ ఆడియో ఫంక్షన్ లో సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు తనతండ్రి అక్కినేని టాలీవుడ్ ఇండస్ట్రీకి డాన్స్ లో గ్రేస్ ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి అంటూ తనకు అఖిల్ డాన్స్ ను చూసినప్పుడల్లా అక్కినేని నాగేశ్వరావు డాన్స్ స్కిల్స్ గుర్తుకు వచ్చి అఖిల్ లో తన తండ్రి అక్కినేని చూసుకుంటున్నాను అంటూ కామెంట్స్ చేసాడు నాగ్. 

ఇదే సందర్భంలో నాగార్జున అఖిల్ నటించిన ‘హలో’ సినిమా గురించి మాట్లాడుతూ ఈసినిమాను తాను చూశానని ఈసినిమా ఖచ్చితమైన బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా అఖిల్ రీలాంచ్ మూవీగా ‘హలో’ మారుతుందని అంటూ ఈసినిమా పై తనకున్న అంచనాలను బయట పెట్టాడు. ఇదే సందర్భంలో నాగ్ మాట్లాడుతూ తన తండ్రి ఆశిస్సులు తమ పై ఎప్పుడు ఉంటాయి అని అంటూ ఈ ఆడియో ఫంక్షన్ జరుగుతున్న వైజాగ్ లో వాన వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవ్వడంతో తాను ఎంతో టెన్షన్ పడి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్న సందర్భాన్ని వివరిస్తూ ఆయన ఆశిస్సులతో వాన కూడ ఆగిపోయింది అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. 

ఇక ఈసినిమా దర్శకుడు విక్రమ కుమార్ గురించి మాట్లాడుతూ ‘మనం’ సినిమాతో విక్రమ్ కుమార్ తన కుటుంబ సభ్యులలో ఒకడుగా మారిపోయిన విషయాన్ని వివరిస్తూ త్వరలోనే నాగచైతన్య కూడ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించబోతున్న విషయాన్ని బయటపెట్టాడు. అయితే వైజాగ్ లో జరిగిన ఈ ఆడియో ఫంక్షన్ లో నాగార్జున చాల జోష్ తో కనిపించడంతో అఖిల్ సినిమా ‘హలో’ విజయం పై నాగ్ కు గట్టి నమ్మకం ఉంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 

హైద్రాబాద్‌ లో కాకుండా కాస్త కొత్తగా విశాఖలో ‘హలో’ ఆడియో ఫంక్షన్‌ నిర్వహించి నాగ్‌ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈకార్యక్రమానికి హాజరైన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సినీ పరిశ్రమ విశాఖకు తరలిరావాలని కోరినప్పుడు నాగ్ చిరునవ్వుతో గంటా సూచనలకు స్పందించడం బట్టి నాగ్ ఆలోచనలు విశాఖపట్టణం పై ఉన్నాయి అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ఏది ఏమైనా వరస విజయాలతో దూసుకు పోతున్న నాని ‘ఎంసిఏ’ తో పోటీ పడుతున్న అఖిల్ ‘హలో’ విజయానికి నాగార్జున వ్యూహాత్మకంగా విశాఖపట్టణాన్ని ఎంచుకున్నాడని అనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: