పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో తన సుడిగాలి పర్యటనను పూర్తి చేసుకుని తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. అయితే పవన్ తన ఘాటైన విమర్శలతో పుట్టించిన చిచ్చు మాత్రం ఇంకా రగులుతూనే ఉంది. చాలామంది రాజకీయ నాయకులు రాజకీయ పక్షాల అధినేతలు పవన్ కామెంట్స్ పై ఎదురుదాడి చేస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో తిరిగి పవన్ కళ్యాణ్ తన మౌన ముద్రలోకి వెళ్ళిపోతున్నాడు. అయితే ఈసారి పవన్ మౌనముద్ర కేవలం కొద్దిరోజులు మాత్రమే ఉండబోతోంది. డిసెంబర్ 20వ తారీఖు ప్రాంతాలలో జరిగే ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో పవన్ మళ్ళీ తన విమర్శకుల మాటలకు ఘాటైన సమాధానాలు ఇవ్వబోతున్నాడు.

ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ పవన్ ‘జనసేన’ కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా ‘జనసేన’ పార్టీని విస్తరించే కార్యక్రమాలలో తాను కూడ తన బాబాయి వెంట ఉంటాను అని స్పష్టమైన సంకేతాలను పవన్ కు పంపుతున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో గాసిప్పులు వినపడుతున్నాయి. అయితే ఈవిషయమై పవన్ ఎటువంటి అభిప్రాయం తెలపకుండా ప్రస్తుతానికి మౌనం వహిస్తునట్లు టాక్. 

గతంలో చిరంజీవి పవన్ ల మధ్య దూరం పెరిగినప్పుడు ఆదూరం మరింత పెరగకుండా చరణ్ తరుచూ తన బాబాయి పవన్ నటించే సినిమాల షూటింగ్ లకు వెళ్ళుతు మధ్యమధ్యలో పవన్ ఇంటికి కూడ చరణ్ వెళ్ళుతూ చిరంజీవి పవన్ ల మధ్య మరింత దూరం పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు అన్న వార్తలు వచ్చాయి. దీనికితోడు పవన్ కు చరణ్ పట్ల వ్యక్తిగత అభిమానం చాల ఎక్కువగా ఉంది అని పవన్ సన్నిహితులు అంటారు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో చరణ్ కోరికను పవన్ మన్నిస్తే అటు మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే కాకుండా చిరజీవి పవన్ ల మధ్య దూరంలేదు అన్న సంకేతాలు కూడ ఇచ్చినట్లు ఉంటుందని పవన్  కుటుంబ అభిమానుల వాదన. అయితే పవన్ మాత్రం ఈవిషయంలో ఎటువంటి స్పష్టత తన కుటుంబ సభ్యులకు కూడ ఇవ్వడంలేదు అని అంటారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: