మహేష్ కొరటాల శివల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ కు ఇప్పుడు అనుకోని సమస్య ఒకటి వచ్చి పడింది అన్న గాసిప్పుల హడావిడి చేస్తున్నాయి. ఈ సినిమాకు ఇప్పటి వరకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న రవి కె. వర్మన్ ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల శివతో ఏర్పడిన క్రియేటివ్ అభిప్రాయభేదాల కారణంగా ఈమూవీ నుండి రవి కె వర్మన్ తప్పుకున్నాడు అని అంటున్నారు. 
MAHESH IN KORATALASHIVA LATEST MOVIE BHARATH ANU NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈసినిమాకు రవి కె వర్మన్ స్థానంలో ‘జనతాగ్యారేజ్’ సినిమాకు పనిచేసిన ఫోటోగ్రాఫర్ తిరు వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఈ మధ్య దర్శకులకు సినిమాటోగ్రాఫర్లకు కుదరక చాల భారీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్లను మార్చడం ఒక సాంప్రదాయంగా మారింది. గతంలో ‘జనతాగ్యారేజ్’ సినిమా విషయంలో కూడ కొరటాల శివతో వచ్చిన భేదాభిప్రాయలతో  సినిమాటోగ్రాఫర్ మాథి తప్పుకుని తిరు వచ్చి చేరిన సంగతి తెలిసిందే.

ఇలాంటి పరిస్థుతులలో దాదాపు సగం పైన పూర్తి అయిపోయిన ఈసినిమా సినిమాటోగ్రాఫర్ ను ఇప్పుడు ఎందుకు మార్చారు అన్న చర్చలు జరుగుతున్నాయి. దీనితో ‘భరత్ అనే నేను’ సినిమా క్వాలిటీ విషయంలో కొరటాల శివ ఏమైనా అసంతృప్తిగా ఉన్నాడా అన్న గాసిప్పులు కూడ హడావిడి చేస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా ఇప్పటికే ప్రచారంలో ఉన్న ‘భరత్ అనే నేను’ టైటిల్ మార్చి మరొక టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోతున్న కొత్త సంవత్సరం కానుకగా ఈసినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడ విడుదల కాబోతున్న నేపధ్యంలో అప్పటి వరకు ఈమూవీ విషయంలో సస్పెన్స్ కొనసాగే ఆస్కారం ఉంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: