బుల్లితెర యాంకర్ గా ప్రోగ్రామ్ హోస్ట్ గా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న యాంకర్ రవి తాను నటించిన 'ఇది మా ప్రేమకథ' అనే సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు. తనకు ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేదనిచెపుతూ తాను చిన్నప్పటి నుండి చిరంజీవి, రజనీకాంత్, నాగార్జున లాంటి హీరోల సినిమాలు చూస్తూ పెరిగన విషయాలను గుర్తుకు చేసుకుంటూ డైరెక్ట్ గా సినిమాల్లోకి వచ్చే పరిస్థితి లేదుకాబట్టి ముందుగా యాంకరింగ్ మొదలు పెట్టినట్లు కామెంట్స్ చేసాడు రవి. 
ఒకరు చెబితే వినను
గత నాలుగైదు సంవత్సరాలుగా యాంకరింగ్ చేసిన తర్వాత సినిమా అవకాశాలు రావడం మొదలైన విషయాన్ని తెలుపుతూ పెద్ద సినిమాల్లో హీరో తమ్ముడు క్యారెక్టర్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లాంటివి వచ్చిన నేపధ్యంలో ఎప్పటికైనా తాను హీరోగా రంగ ప్రవేశం చేయాలాని తాను ఆపాత్రలను తిరస్కరించిన విషయాలను బయటపెట్టాడు. తాను ఈ గ్లామర్ ఫీల్డ్ కు వచ్చిన రోజు నుండి ఈ ఇండస్ట్రీలో ఎందరో జీవితాలు నాశనం అయిన సందర్భాలను తాను కళ్ళారా చూశానని అంటూ తాను ఇప్పటికీ సినిమా రంగం అంటే విపరీతంగా భయపడతాను అని అంటున్నాడు.
ఇది తప్ప మరో బ్రతుకుదెరువు లేదు
సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా వారికి తెలియకుండానే తప్పులు జరిగిపోతాయని చిన్న తప్పులకు కూడ పెద్ద ఫలితాలు ఉంటాయని ఈ గ్లామర్ ఫీల్డ్ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో తన జీవితం పై తాను కామెంట్స్ చేసుకుంటూ అందరికీ షాక్ ఇచ్చాడు.

తనకు ఈ గ్లామర్ ఫీల్డ్ తప్ప వేరే బ్రతుకు దెరువు లేదు అని అంటూ తాను సాఫ్ట్ వేర్ జాబో, కార్పెంటర్ జాబో, మరేదో వ్యాపారం చేయడం తనకు చేతకాదు అని అంటూ చచ్చినా బ్రతికినా ఈ ఇండస్ట్రీలోనే ఉండిపోవాలసిన పరిస్థితి తనది అని అంటూ తన పై తానే షాకింగ్ కామెంట్స్ చేసుకున్నాడు. రవి చేసిన కామెంట్స్ చూస్తుంటే ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న చీకటి కోణాలతో పాటు ఈ ఇండస్ట్రీలో వర్ధమాన నటీనటులు యాంకర్లు పడుతున్న కష్టాలు కళ్ళకు కట్టినట్లు అర్ధం అవుతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: