తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  తాజాగా  సినీ కమెడియన్ విజయ్ ఆత్మహత్య చేసుకునాడు. అమ్మాయిలు – అబ్బాయిలు మూవీలో ఒక హీరో తెలుగు గా తెరకి పరిచయం అయిన విజయ్ హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో నివాసం ఉంటున్నాడు. గత కొంత కాలంగా విజయ్‌కి సినిమాల్లో అవకాశాలు లేక తీవ్ర ఆందోళన చెందాడు. తన ఫ్లాట్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. బొమ్మరిల్లు, ఒకరికి ఒకరు సినిమాలతో మంచి కమెడియన్ గా, టైమింగ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.

హీరోల పక్కన కమెడియన్, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. అవకాశాలు లేక  అప్పులు కూడా ఉండటంతోనే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడని సన్నిహితులు చెబుతున్నారు. ఎప్పుడూ నవ్విస్తూ, చలాకీగా ఉండే విజయ్ ఆత్మహత్యతో సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది.  ఎప్పుడూ నవ్విస్తూ, చలాకీగా ఉండే విజయ్ ఆత్మహత్యతో సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

విజయ్ మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మా అసోషియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా.. విజయ్‌కు తెలుగు ఇండస్ట్రీ సభ్యులతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అందరితో చాలా కలివిడిగా ఉండే వాడిని.. ఇటీవల విజయ్‌ తనలో మాట్లాడినట్లు తెలిపారు. విజయ్ మృతికి మా అసోషియేషన్ తరుపున సంతాపం తెలుపుతూ అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు శివాజీ రాజా.


మరింత సమాచారం తెలుసుకోండి: