టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని సమంత తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించింది.  సమంత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు దాటింది..అయితే ఇప్పటి వరకు డి గ్లామర్ పాత్రల్లో కనిపించలేదు.  గ్లామర్ పరంగా తన అందచందాలతో స్టైలిష్ గా కనిపించే సమంత ఇప్పుడు డి గ్లామర్ పాత్రతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు విషయానికి వస్తే..ప్రముఖ దర్శకులు సుకుమార్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న ‘రంగ స్థలం 1985’ లో సమంత ఓ పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుంది. 
‘రంగస్థలం’ చరణ్ లుక్ చూస్తే నిజంగా షాక్..!
1985 నాటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో వస్తున్న ఈ చిత్రంలో రాంచరణ్ కూడా ఊరమాస్ లుక్ లో కనిపించాడు.  రిసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  వాస్తవానికి రాంచరణ్ కూడా ఇలాంటి పాత్రలో ఎప్పుడూ కనిపించలేదు.  కాగా, శ‌నివారం విడుద‌ల చేసిన రామ్ చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో రెండు స్టిల్స్ కూడా శ‌నివారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

‘రంగస్థలం’ చరణ్ లుక్ చూస్తే నిజంగా షాక్..!
ఇక ఆదివారం కూడా స‌మంత సోలో స్టిల్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.  ఒక స్టిల్‌లో గేదెల‌ను లాక్కుంటూ వెళుతుంటే.. మ‌రో స్టిల్‌లో పొయ్యి ముందు కూర్చుని మ‌హా మాస్‌గా వంట చేస్తోంది.  నిజంతా ఈ స్టిల్స్ చూస్తుంటే..అసలు సమంతేనా అన్న అనుమానాలు వస్తున్నాయి.  ఈ మద్య అక్కినేని అబ్బాయి నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్న సమంతో ‘రంగస్థలం’ ఓ ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తుంది.   మొత్తానికి 'రంగ‌స్థ‌లం' తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతినిచ్చే సినిమా అయ్యేలా ఉంది. మార్చి 30న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: