భారత దేశంలో గత కొంత కాలంగా మహిళలపై కామాంధులు అఘాయిత్యాలు బాగా ఎక్కువే అయ్యాయి.  ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్న వార్తలు వింటూనే ఉన్నాం.  ఈ బాధలు సామాన్య మహిళలకే కాదు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదని పలు సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా దంగల్ నటి జైరా వాసీంతో విమానంలో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ప్రయాణికుడు. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విస్తారా ఏయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది.
zaira-wasim-allegedly-molested-on-delhi-mumbai-flight
అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఈ హీరోయిన్ ని ఓ మృగాడు అసభ్యంగా ప్రవర్తించాడు దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఈ భామ అసహనం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీ నుండి ముంబై కి విస్తారా విమానంలో బయలుదేరింది. అయితే రాత్రి పూట కావడంతో ఆమె వెనకాల సీటులో ఉన్న ఓ వ్యక్తి  జైరా వసీం భుజాన్ని తడుముతూ ఉండటమే కాకుండా కాళ్ళు కూడా చాపి మరీ మృగం లా ప్రవర్తించాడట .
zairawasim
ఫ్లైట్ లో ప్రయాణికుడు తనను తాకుతున్న వీడియోతో పాటూ విమానం దిగిన తర్వాత.. ఏయిర్ పోర్టులో ఏడుస్తూ మరో వీడియో పోస్ట్ చేశారు. అయితే జైరా ఆరోపణలపై విస్తారా ఏయిర్ లైన్స్ స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. వేదింపులకు పాల్పడ్డ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: