ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆధార్ కు సంబంధించిన చర్చలే జరుగుతున్నాయి. మన కేంద్రప్రభుత్వం కూడ ఈ ఆధార్ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోంది. భారతీయ జనతాపార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్న పవన్ ఆపార్టీ అధినాయకత్వం ప్రవేశ పెట్టిన ఆథార్ ను తన ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ కు ఆథారంగా వాడుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఆశ్చర్యకరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే పెద్ద హీరోల సినిమా ఫంక్షన్లకు పాస్ లతో పెద్ద తలకాయనొప్పి ఏర్పడటమే కాకుండా వేలల్లో ఫాస్ లు వేసినా సరిపోని నేపధ్యంలో ఈ కొత్త పద్దతిని అనుసరిస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ కు కొత్త టెక్నాలజీని వాడుకోబోతున్నారు. ఇప్పటికే అనేకమంది టాప్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లకు చిప్ కార్డులు, కోడ్ ప్రింట్ చేసిన కార్డులు ఉపయోగించిన సందర్భాలు తెలిసినవే. 

అయితే ఈసారి ‘అజ్ఞాతవాసి’ మరో అడుగు ముందుకు వేసి తన ఆడియో ఫంక్షన్ కు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ అభిమానులకు బయోమెట్రిక్ కార్డులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ కేవలం ప్రస్తుతం టాప్ హీరో మాత్రమే కాకుండా ఒక రాజకీయ పార్టీ నాయకుడు అయిన నేపధ్యంలో ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ లో ఎవరైనా లేనిపోని గొడవలు సృష్టిస్తారు అన్న భయంతో ఈ బయోమెట్రిక్ పాస్ లను ఉపగించబోతున్నారాని టాక్. 

ఈమూవీ ఆడియో ఫంక్షన్ హెచ్ ఐ ఐ సి లాంటి భారీ ఇండోర్ హాల్ లో జరుగుతున్న నేపధ్యంలో అభిమానులకు ఇచ్చే పాస్ ల విషయంలో ఈ బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించబోతున్నారు.ఈప్రక్రియలో అభిమానుల ఆధార్ నెంబర్లు తీసుకుని వాటిని ఎంట్రీ వేసుకుని మళ్లీ ఆడిటోరియంలో  దగ్గర రిజిస్టర్ లో పేరు, ఆధార్ నెంబరు, వచ్చినది ఆ వ్యక్తేనా కాదా అన్నది వేలి ముద్ర సాయంతో వెరిఫై చేసుకుని లోపలకు పంపించే ప్రయత్నం ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ లో జరగబోతున్నట్లు టాక్. అయితే ఈ పద్ధతి ఏమాత్రం శులభమైనది కాకపోయినప్పటికీ ఎంత వరకు ‘అజ్ఞాతవాసి’ టీమ్ ఈ పద్ధతిని విజవంతంగా ఉపయోగించ గలుగుతారు అన్న విషయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: