రజనీకాంత్ ....ఇది పేరు కాదు ఓ బ్రాండ్. ఆడియన్స్ కి ఆయనో సూపర్ స్టార్... నిర్మాతల పాలిట కామధేనువు. భాషాగా సెన్సేషన్ క్రియేట్ చేసినా.. రోబోగా కొత్త ట్రెండ్ సెట్ చేసినా అది తమిళ్ తలైవాకే చెందింది. డిసెంబర్ 12 రజనీకాంత్ బర్త్ డే.

 Image result for RAJINIKANTH

"కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సూపర్ స్టార్ రజనీకాంత్. 1950 డిసెంబర్ 12న బెంగుళూరులో శివాజీ రావు గైక్వాడ్ గా జన్మించిన రజనీ.. మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరకముందు లేబర్ గా, బస్ కండక్టర్ గా  పనిచేసాడు. అయితే అతనిలోని స్టైల్ ని క్యాచ్ చేసిన కె.బాలచందర్ 1975లో తీసిన ‘అపూర్వ రాగన్గల్' సినిమాలో  ఛాన్స్ ఇవ్వడంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు.

 Image result for RAJINIKANTH

బిగినింగ్ లో విలన్ గా నటించిన రజనీ తరువాత హీరోగా ట్రాక్ మార్చాడు. అంతులేని కథతో మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. ఇక 1980ల్లో టాప్ తమిళ్ స్టార్ గా ఎదిగిన రజనీ 1990లో ఎన్నో కమర్షియల్ హిట్ సినిమాలను అందించాడు. ‘దళపతి', ‘భాషా', ‘ముత్తు', ‘అరుణాచలం', నరసింహా', ‘చంద్రముఖి', ‘శివాజీ', ‘రోబో' వంటి సినిమాలు రజనీ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినవే.

 Image result for RAJINIKANTH

గతంలో రోబో అంటూ కొత్త టెక్నాలజితో ట్రెండ్ బెండ్ తీసిన రజనీ కాంత్ ఇప్పుడు మరోసారి అదే ప్లేవర్ తో సరికొత్త విందు చేయబొతున్నాడు. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ త్రీడి మూవీ ఇండియాలోనే కాస్ట్లీ ఫిల్మ్‌ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే దుబాయ్ లో ఆడియో ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలబ్రెట్ చేసిన ఆ సినిమా యూనిట్  ఏప్రిల్ 27న ఈ చిత్రాన్నిఆడియన్స్ ముందుకు తీసుకురాబోతుంది.

 Image result for RAJINIKANTH

ఇప్పటికే  రోబో 2.0 సినిమా హిందీ హక్కులు 80 కోట్లకి అమ్ముడుపోగా, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రేటు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అన్ని భాషల్ని కలుపుకొని ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 110 కోట్లకి అమ్ముడు పోయినట్టు సమాచారం. ప్రజంట్ వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ లేట్ అవ్వడంతో రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. అయితే రజనీ బర్త్ డే సందర్భంగా టీజర్ ని లాంచ్ చేసే యోచనలో ఉంది ఆ ఫీల్మ్ టీం.

 Image result for RAJINIKANTH

ఇలా ఒక వైపు రోబో 2.0తో హల్ చల్ చేయబోతున్న రజనీ వెంటనే కాలాగా మరో షాక్ ఇవ్వబోతున్నాడు. కబాలీ ఫేమ్‌ రంజీత్‌ దర్శకత్వంలో ముంబై గ్యాంగ్‌స్టర్‌ గా కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో ప్రజెంట్ ప్రోస్ట్ పోడక్షన్ వర్క్స్ స్సీడందుకుంది. రోబో2.0 రిలీజ్ అయిన 2 మంథ్స్ కే ఈ సినిమా ఆడియాన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.

 Image result for RAJINIKANTH

ఎలా చూసినా 2018... రజనీ నామ సంవత్సరంగా మారబోతుంది. ఒకవైపు భారీ బడ్జెట్ తో రోబో 2 అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేసి కొత్త వండర్ సృష్టించాలనే కసిమీద ఉన్నాడు శంకర్. మరోవైపు కబాలీ షాక్ ఇవ్వడంతో కాలాతో రజనీ ఇమేజ్ లో మరింత మైలేజ్ పెంచాలనే ఆలోచనలో ఉన్నాడు రంజీత్. మరి ఈ రెండు సినిమాలు అంచనాలను రీచ్ అయితే తమిళ్ తలైవా రికార్డ్స్ ని రీచ్ అయ్యే హీరో లేడంటే ఆశ్చర్యమే లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: