సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చి వెండి తెరపై తమ సత్తా చాటిన నటులు ఎంతో మంది ఉన్నారు.  అలాంటి వారిలో కాదంబరి కిరణ్ కుమార్ ఒకరు.  కేవలం నటుడిగానే కాకుండి నిర్మాతగా మారిన కాదంబరి కిరణ్ కుమార్ సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చారు.  ఈ నేపథ్యంలో ‘మనం సైతం’ అనే ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి  కష్టాల్లో ఉన్న పేదవాళ్ళకోసం, ఆపదలో ఉన్న సినిమావాళ్ళ కోసం, ఇంకా ఎవరైనాకానీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, పెళ్లి, చావు కష్టం ఏదైనా.. తమవంతు సాహాయ పడుతున్నారు.

ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న సెలబ్రెటీల పరిచయం ఉండటం..ఆయన మంచితనం గురించి తెలుసుకున్నవారు పేదల కోసం ఎంతో అంత విరాళాన్ని ఇవ్వడం జరుగుతూ వస్తుంది.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘మనం సైతం’ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకొని కాదంబరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘మనం సైతం’ కు తన వంతుగా రూ. 2 లక్షల విరాళాన్ని చిరంజీవి ఇచ్చారు. ‘మనం సైతం’ అనే వాట్సాప్ గ్రూప్ ప్రారంభించినప్పుడు స్నేహితులు, సన్నిహితులు, తోటినటులతో మొదలైంది.   

ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ..ఒక ఆనందం! ఒక ఆశ్చర్యం!!ఒక అద్భుతం!!! అన్నయ్య పిలవడం..20ని.ల పాటు”మనం సైతం” 
కార్యక్రమాలను అభినందించడం..‘‘మనంసైతం”ఒక చరిత్రగా నిలిచిపోతుంది! ప్రభంజనంలా సాగిపో,నీవెనుక నేనున్నా!!” ఇదికేవలం ప్రారంభం మాత్రమే!!” అంటూ2లక్షలరూపాయిలు ఇచ్చి భుజం తట్టడం.. ఇదీ..ఈక్షణం ..నా జన్మలో జరిగిన ఒక అద్భుతం! అన్నయ్యా!   వియ్ లవ్ యూ !!


మరింత సమాచారం తెలుసుకోండి: