తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రజినీకాంత్.  బక్కపలచని దేహం, నల్లటి ఛాయ.. కానీ ఆయన కంటిచూపు వెండితెరను షేక్ చేస్తుంది. ఆయన స్టైల్‌గా నడిచొస్తుంటే అభిమానుల ఈలలు, కేకలు, చప్పట్లు మారుమోగుతాయి. వయసు మీద పడుతున్నా ఆయనలోని జోష్, స్టైల్ ఏమాత్రం తగ్గలేదు. గత సంవత్సరం పా రంజిత్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘కబాలి’ ప్రపంచ స్థాయిలో ఒక్క ఊపు ఊపింది.
Related image
ప్రస్తుతం ఇదే కాంబినేషన్ లో మరోసారి వస్తున్న ‘కాలా’ చిత్రానికి సంబంధించిన సెకండ్ లుక్ విడుదలైంది. రజినీకాంత్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన అల్లుడు ధనుష్ తన ట్విట్టర్ ఖాతాలో సెకండ్ లుక్‌ను పోస్ట్ చేశారు. కొన్ని నెలల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో రజనీ థార్‌ జీపుపై స్టైల్‌గా కూర్చున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు (డిసెంబర్ 12) 68వ ఏట అడుగుపెట్టారు. తలైవా పుట్టినరోజు సందర్భంగా తమిళనాట ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లే. సోషల్ మీడియా నిండా తలైవా ఫొటోలు, బర్త్‌డే విషెస్‌లే. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘కాలా’ సినిమా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.
Image result for kabali tills
నలుపు రంగు చొక్కా, క‌ళ్ల‌ద్దాలు, చెదిరిన గ‌డ్డంతో రఫ్‌లుక్‌లో క‌నిపిస్తున్న ర‌జ‌నీ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ లుక్ నిజంగా స్టైల్‌కి చిరునామాగా ఉంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇందులో హ్యూమా ఖురేషీ, సాక్షి అగ‌ర్వాల్‌, నానా ప‌టేక‌ర్‌, పంక‌జ్ త్రిపాఠిలు న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే అభిమానులు ఏర్పాటు చేస్తున్న పుట్టిన రోజు వేడుకల్లో రజనీ పాల్గొంటారా లేదా అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: