టాలీవుడ్ లో కామెడీతో దాడి చేసి.. హీరోగా ట్రాక్ మార్చిన నటుడు సునీల్. బిగినింగ్ లో హీరోగా పర్వాలేదు అనిపించినా తరువాతే తన కెరియర్ గాడి తప్పింది. మొన్న ఉంగరాల రాంబాబు అంటూ.. సందడి చేసినా సీన్ మారకుండాపోయింది. అందుకే ఇప్పుడు ఫుల్ టైం కామెడీతో టూ కంట్రీస్ సినిమాని మనముందుకు తీసుకురాబోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ బాగుడటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయ్.

Image result for sunil

టాలీవుడ్ లో వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న హీరో సునీల్. గత కొంతకాలంగా తను ఏ మూవీ ముట్టుకున్న చేతులు కాలుతున్నాయ్. గెటప్ నుంచి స్టోరీ వరకు ఎన్ని చేంజ్ చేసిన లక్ కిక్కు ఇవ్వకుండా పోతుంది. అందుకే ఇప్పుడు తనకి కలిసొచ్చిన కామెడితోనే గారడీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. టూ కంట్రీస్ ని ఆ రూట్ లోనే తెరకెక్కించి సందడి చేయబోతున్నాడు.

Image result for sunil

రీసెంట్ గా టూకంట్రీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. విలన్ దేవ్ గిల్.. సునీల్ తో.. "తెల్లబట్టలు వేసుకున్న ప్రతివాడూ ఫ్యాక్షనిస్ట్ కాలేడు" అంటే.. సునీల్ "నల్ల బట్టలు వేసుకున్న ప్రతివాడూ అయ్యప్ప స్వామి భక్తుడు కాలేడు" అని బదులిచ్చిన డైలాగ్ హైలైట్ గా మారింది. ఎన్.శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మనీషా రాజ్, సంజన గల్రానీ హీరోయిన్లు గా నటిస్తున్నారు.

Image result for sunil

తన బలమైన కామెడీని వదిలిపెట్టి నేల విడిచి సాము చేశాడు సునీల్. గత నాలుగేళ్లుగా హిట్టు ముఖమే చూడలేదు. చివరగా వచ్చిన ‘ఉంగరాల రాంబాబు’ కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది. అందుకే తన ఆశలన్నీ ‘2 కంట్రీస్’ మీదే పెట్టుకున్నాడు సునీల్. ఈ చిత్రం ఫస్ట్ లుక్.. టీజర్ కొంచెం పాజిటివ్ ఫీలింగే ఇచ్చాయి. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ వచ్చింది. ఇది ఇంకొంచెం పాజిటివిటీని తీసుకొచ్చేలా ఉంది. సునీల్ నుంచి ఏం మిస్సవుతున్నామని ప్రేక్షకులు అంటున్నారో అది ఇందులో బాగానే కనిపిస్తోంది.

Image result for sunil

మలయాళంలో సూపర్ హిట్టయిన ‘2 కంట్రీస్’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కామెడీ ప్రధానంగా సాగే సినిమాలా కనిపిస్తోంది. సునీల్ ఒకప్పటిలా నవ్వించే ప్రయత్నం చేయగా.. పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, నరేష్.. జబర్దస్త్ అప్పారావు.. తదితరులు కూడా తలో చేయి వేశారు. ఐతే కామెడీ కొంచెం లౌడ్ గా కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులకు సినిమా బాగానే కనెక్టయ్యేలా ఉంది. సినిమాలో కొంతమేర ఎమోషన్లకు కూడా ప్రాధాన్యం ఉందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. గత సినిమాల్లో మాదిరి సునీల్ ఫైట్లు, డ్యాన్సులు.. హీరో ఎలివేషన్ల కోసం ప్రయాస పడినట్లు లేడు. ట్రైలర్లో ఆ ఛాయలే కనిపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాలో రిచ్ లుక్ కనిపిస్తోంది. మరి చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: