టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు సంవత్సరాల నుంచి నేచురల్ స్టార్ నానికి గోల్డెన్ టైమ్ నడుస్తుంది.  ఈ సంవత్సరం నేను లోకల్, నిన్నుకోరి సినిమాలతో మంచి విజయం అందుకున్న నాని తాజాగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాలో నటిస్తున్నారు.  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకానుంది.
Image result for nani mca stills
ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 16న వరంగల్‌లో నిర్వహించబోతున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు నాని. వ‌దిన‌, మ‌రిదిల మ‌ధ్య అనుబంధాన్ని తెలియ‌జేసే చిత్రంగా ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’ ఉండబోతున్నట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ​ మేం మిడిల్ క్లాస్ అబ్బాయిలం అన్నా.. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వడం కాదు.. ముందుగానే ప్రిపేర్డ్‌గా ఉంటాం.. అంటూ నాని చెప్పిన డైలాగ్స్‌ చూస్తుంటే..సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 
mca
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ఈ ఏడాది ఆరంభంలో మా సంస్థలో నాని నటించిన నేను లోకల్ పెద్ద విజయం సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకు అందమైన దృశ్యరూపంలా సాగే చిత్రమిది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్నందించాడు. ఇటీవల విడుదలైన పాటలు శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వరంగల్ ప్రజలు, అభిమానుల సమక్షంలో ఆడియో వేడుకను వైభవంగా నిర్వహించబోతున్నాం అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: