మొదటి సినిమాతో సక్సస్ అందుకోలేకపోయిన అక్కినేని అఖిల్ ఆ పరాజయం నుండి ఎన్నోకొత్త విషయాలు నేర్చుకుని చాలా సమయం తీసుకుని నటిస్తున్న సినిమా ‘హలో’ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మింపబడ్డ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు అఖిల్. ఈనెలలో క్రిస్మస్ సీజన్ ను టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు అఖిల్.  

తన మొదటి సినిమా ఫెయిల్ కావడంతో తన తప్పులు తనకు అర్ధం అయ్యాయి అని అంటూ ‘అఖిల్' ప్లాప్ అవ్వడం వల్లే ‘హలో' లాంటి కొత్త తరహా కథల వైపు దృష్టి పెట్టాను అని అంటున్నాడు. ఇదే సందర్భంలో అఖిల్ మాట్లాడుతూ ‘హలో' తన జీవితాన్ని మార్చే సినిమా అవుతుందని కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు తన తండ్రి నాగార్జున ముఫ్ఫై ఏళ్ల అనుభవం ‘హలో' కి బాగా పనికొచ్చింది అని అంటూ తన తండ్రి సపోర్టుగా ఉండటం వల్లే ఆసినిమా ఇంతబాగా వచ్చింది అని అంటున్నాడు. ఇదే సందర్భంలో తనకు  క్రికెట్‌ పై ఉన్న విపరీతమైన ఇష్టాన్ని గ్రహించి తన తల్లి అమల తనతో చెప్పిన అబద్దాన్ని బయటపెట్టాడు. 

తాను చాలాకాలం  జాతీయ క్రికెట్ టీంలో ఆడాలనుకునేవాణ్నిఅని చెపుతూ క్రికెట్ గేమ్ లో బాగా రాణించాలి అంటే మాంసం ఎక్కువగా తినాలి అని తన చిన్నప్పుడు ఏర్పడిన భావాలతో తెగ మాంసం తింటుండటంతో ఆ అలవాటు మార్చడానికి తన తల్లి సచిన్‌ బెండకాయ ఎక్కువగా తింటాడని అబద్దం చెప్పి తనతో బెండకాయ తినిపించే అలవాటు చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఇదే సందర్భంలో తనకు చిన్నప్పటి నుంచి రకరకాల ఆహార పదార్ధాల పై ఇష్టం అని చెపుతూ తన మేనమామ వెంకటేష్ ను కలిసినప్పుడల్లా ఇద్దరం ముందు తిండి గురించి మాట్లాడుకున్న తరువాత మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటాము అంటూ జోక్ చేసాడు. ఏమైనా అమల చెప్పిన అబద్ధంతో అఖిల్ తన ఆహారపు అలవాట్లను కొంత వరకు మార్చుకున్నాడనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: