వెంకటేష్ ... టాలీవుడ్ లో క్లాస్, మాస్ మూవీస్ తో ట్రెండ్ బెండ్ తీసిన విక్టరీ వీరుడు. మల్టిస్టారర్ మూవీస్ కి వెల్ కమ్ చెప్పిన స్టార్. ఢిఫరెంట్ ఎక్స్‌ ప్రెషన్స్, వెరైటీ కామెడీ, మంచి టైమింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు. రీసెంట్ గా గురు అంటూ కొత్త జోనర్ ని స్టార్ట్ చేసిన వెంకీ ఇప్పుడు తేజా డైరెక్షన్ లో ఓ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లుతున్నాడు. ఈ రోజు వెంకటేష్ బర్త్ డే.

Image result for venkatesh

‘కలియుగ పాండవులు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఆడియన్స్ మదిలో మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరో వెంకటేష్. మొదటి సినిమాకే బెస్ట్ డెబ్యూ యాక్టర్ కేటగిరీలో నంది అవార్డ్ సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ సక్సెస్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న వెంకీ కెరియర్ ని టర్న్ చేసిన మూవీ ‘స్వర్ణ కమలం’. విశ్వనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వెంకీ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది.  వెంకటేష్ కి అన్ లిమిటెడ్ స్టార్ డంని సంపాదించి పెట్టిన మరో మూవీ ‘బొబ్బిలి రాజా’. వెంకీ కెరీర్ లోనే కాదు, సినిమా అభిమానుల్లోనూ పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక వెంకటేష్ తన కెరీర్ లో చాలామంది హీరోయిన్స్ తో జత కట్టాడు. ఆల్ టైం హిట్ పెయిర్ గా నిలిచింది మాత్రం వెంకటేష్ సౌందర్య కాంబి నేషనే. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా ఓ స్పెషల్.

Image result for venkatesh

వెంకటేష్ కెరీర్ లో ఫ్యామిలే హిట్స్ చాలానే ఉన్నా అందులో ‘సుందర కాండ’,’కలిసుందాం రా’,’నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలు వెంకీకే కాదు, వెంకీ ఫ్యాన్స్ కి కూడా సో స్పెషల్. ఈ సినిమాలతో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసాడు వెంకటేష్. రొటీన్ పర్ఫామెన్స్ తో ఎప్పుడూ బోర్ కొట్టించలేదు వెంకటేష్. అప్పుడప్పుడు మాస్ మసాలా ఎలిమెంట్స్ తో, యాక్షన్ హీరోగా కూడా సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. క్షణక్షణం,  లక్ష్మి, తులసి సినిమాలు వెంకీలోని ఇన్ సైడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎలివేట్ చేశాయి. ఇక ఘర్షణ మూవీలో పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెస్మరైజ్ చేసాడు వెంకీ.

Image result for venkatesh

ఫ్యామిలీ హీరోగా మంచి ప్రేక్షాకదరణ పొందిన వెంకీ తరువాత మల్టీస్టారర్ చిత్రాలకు తెరలేపాడు. మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలతో జోడి కట్టి మల్టీ స్టారర్ చిత్రాలకు మంచి ఆదరణ వచ్చేలా చేసాడు. సినిమా సినిమాకి వెరియేషన్ చూపిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న వెంకీ.. మొన్న మారుతి మేకింగ్ లో బాబు బంగారంగా మెరిసాడు. తరువాత గురు అంటూ ట్రాక్ మార్చి యంగ్ లుక్ లో, డైనమిక్ కోచ్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసాడు. ప్రజెంట్ నేనే రాజు నేనే మంత్రితో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న తేజాతో ఓ కొత్త మూవీని సెట్స్ పైకి తీసుకు వెళ్తున్నాడు. ఎలా చూసినా టాలీవుడ్ లో ఇప్పటికే 7 నందులను అందుకున్న వెంకీ తన సినిమాల ద్వారా చాలా మంది కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేసాడు. ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలి జవేరి వంటి స్టార్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇప్పటికే అన్ని జోనర్స్ లో రకరకాల సినిమాలు చేసిన వెంకటేష్ నెక్స్ట్ ఇయర్ మరిన్ని సినిమాల్లో నటించి ఆడియన్స్ లో జోష్ నింపబోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: