తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విశాల్.  వాస్తవానికి విశాల్ తెలుగు వాడే అయినా తమిళ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.  దాంతో విశాల్ ని తమిళ హీరో అనే అంటారు.    ఇటీవల  విశాల్‌ నటించి 'డిటెక్టివ్‌'తో సూపర్‌హిట్‌  అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'అభిమన్యుడు'. ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌తో అలరిస్తారు.
Image result for విశాల్ అభిమన్యుడు
విశాల్, గ్లామర్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఇరుంబు థిరై. తెలుగులో ఈ చిత్రం అభిమన్యుడు గా రిలీజ్ కానుంది.  ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించి    ఫ‌స్ట్‌లుక్‌ని ఆ మద్య  చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఆస‌క్తిక‌రంగా ఉన్న ఈ పోస్ట‌ర్‌ని చూస్తే.. ఇదో మైండ్ గేమ్ బేస్‌డ్ మూవీలా అనిపిస్తోంది. టెక్నీక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్స్‌లో ఈ సినిమా ఉండొచ్చ‌నిపిస్తోంది.  రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Image result for విశాల్ అభిమన్యుడు
ఇప్పటికే చిత్రంలో విశాల్ కి సంబంధించి రెండు లుక్స్ విడుదల చేసిన యూనిట్ తాజాగా మరో లుక్ విడుదల చేసింది. ఇది స్టన్నింగ్ గా ఉండటంతో పాటు అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. లావిష్ గా తెరకెక్కిన ఇరుంబు థిరై చిత్రం పాటలు డిసెంబర్ 27న విడుదల చేయాలని భావిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: