మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రావడంతో  ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ లో ఓ ఇండోర్ స్టేడియంలో ఈ  ప్రాగామ్ ని ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ఆచితూచి అడుగులేస్తుంది. పవన్ ఫ్యాన్స్ కి బయో మెట్రిక్ పాసులిచ్చి కొత్త టెక్నాలజీకి వెల్ కమ్ చెప్పాలనే ప్లాన్ లో ఉంది ఆ సినిమా యూనిట్.

Image result for AGNATHAVASI

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆరాటంగా ఎదురుచూస్తున్న అజ్ఞాతవాసి రిలీజ్ కి రెడి అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని బయటకొచ్చి చూస్తే టైమేమో పాటను అభిమానుల కోసం రిలీజ్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచింది ఆ ఫిల్మ్ టీం. అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్బ్ గా ఉండటంతో అభిమానుల్లో ఈసినిమాపై బజ్ మరింత పెంచింది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఆడియో ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి సినిమా పై హైప్ పెంచాలనే ఆలోచనలో ఉంది ఈ సినిమా యూనిట్. అందుకే ఈ ఫంక్షన్ కోసం హైదరాబాద్ లో ఓ భారీ ఇండోర్ స్టేడియంని బుక్ చేసింది.

Image result for AGNATHAVASI

పవన్ ‘అజ్ఞాతవాసి’ ఫంక్షన్ పై ఇప్పుడు కొత్త తలపోటు మొదలైయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే వేడి మొదలైంది. జనసేన పార్టీ పెట్టి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ రీసెంట్ గా పొలిటికల్ వ్యవహారాల్లోనూ బాగా యాక్టివ్ అయ్యాడు. ఇలాంటి తరుణంలో అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ ద్వారా పవన్ పొలిటికల్ కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది రాకుండా.. అదే టైంలో సినిమాపై ఎటువంటి విమర్శలు రాకుండా ఉండేలా ఈ ఫంక్షన్ పూర్తి చేయడం ఆ ఫిల్మ్ టీం కి కత్తిమీద సాములా మారింది.

Image result for AGNATHAVASI

అజ్ఞాతవాసి  ఆడియో పంక్షన్ లో మెగా అభిమానులతో పాటు వ్యతిరేకులు వచ్చి గలాభా చేసే అవకాశాలు ఉండటంతో అలాంటివి జరగకుండా ఉండేందుకు కొత్త ప్లాన్ ని అప్లయ్ చేయబోతున్నాడు పవన్. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఫ్యాన్స్ కి బయో మెట్రిక్ పాసులిచ్చి ప్రాబ్లమ్ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడట పవర్ స్టార్.

Image result for AGNATHAVASI

ఎలా చూసినా అజ్ఞాతవాసి ఆడియోనే కాదు.. ఆడియో రిలీజ్ ఫంక్షన్ టెలికాస్ట్ రైట్స్ కూడా భారీ మొత్తం లో అమ్ముడు పోయాయి. ఈ ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ రైట్స్ కోసం ఓ ప్రముఖ ఛానల్ 85 లక్షలు ఆఫర్ చేసినట్లు టాక్. ఆడియో ఎప్పుడు.. ఎక్కడ నిర్వహించాలనే దానిపై అజ్ఞాతవాసి యూనిట్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ప్రజంట్ పవన్ తో డిస్కర్షన్ చేసి ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: