మెగాస్టార్ గా తెలుగు సినిమా రంగాన్ని దాదాపు 35 సంవత్సరాలుగా ఏలుతున్న చిరంజీవిని అతడి సమక్షంలో ‘నీకంటూ చెప్పుకోతగ్గ సినిమాలు ఏమైనా నటించావా?’ అని అడగగలిగిన సాహసం ఎంత గొప్ప వ్యక్తి అయినా చేయలేడు. అయితే అటువంటి సాహసం విప్లవ సినిమాల నాయకుడు పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తి చేసాడు. 

ఆసక్తికరమైన ఈ సంఘటన మొన్న జరిగిన దర్శకరత్న దాసరినారాయణరావు జీవిత చరిత్రకు సంబంధించిన ‘తెర వెనుక దాసరి’ పుస్తక ఆవిష్కరణ సభలో జరిగింది.   దీనితో నారాయణమూర్తి నోట ఆమాటలు విని ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది షాక్ ఐనట్లు టాక్.  

ఇదే సందర్భంలో నారాయణ మూర్తి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ లకు కొన్ని దశాబ్దాలు గడిచిపోయినా ముందు  తరం గుర్తుంచుకునే గొప్పసినిమాలు ఉన్నాయి అంటూ అటువంటి స్థాయిలో గొప్ప సినిమాలు చిరంజీవికి ఉన్నాయా ? అంటూ నారాయణమూర్తి ఆవేశంగా ప్రశ్నించాడు. ఈమాటలకు ఒక్క క్షణం చిరంజీవి కూడ షాక్ అయ్యాడు. అయితే వెంటనే నారాయణమూర్తి సర్దుకుని మరో ట్విస్ట్ ఇచ్చాడు. 

చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా కావాలి అంటూ తన మాటల భావం అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ మాటలతో తెరిపిన పడ్డ చిరంజీవి నారాయణమూర్తి వైపు చూస్తూ నవ్వుతూ నమస్కారం పెట్టాడు. అయితే చిరంజీవి నటించిన మూవీలలో    ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ‘అపద్బాంధవుడు’ ‘స్వయంకృషి’ ‘రుద్రవీణ’ లాంటి సినిమాలు గొప్ప సినిమాలు కాదని పరోక్షంగా నారాయణమూర్తి మాటలకు అర్ధమా ? లేదంటే ఆవేశంతో నారాయణమూర్తి ఇలాంటి కామెంట్స్ చేసాడా ? అనే విషయం పై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: