పవన్‌కళ్యాణ్‌ త్రివిక్రమ్‌ ల ‘అజ్ఞాతవాసి’ మూవీలోని రెండవ పాట కూడా రిలీజ్ అయి రెండురోజులు అవుతున్న నేపధ్యంలో ఈమూవీ పాటల పై పవన్ అభిమానులలో కూడ కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘అజ్ఞాతవాసి’ మొదటి పాటలాగే రెండవ పాట కూడ మెలోడీ టచ్ తో క్లాసిక్ గా ఉన్నాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ పాటల ట్యూన్స్ యూత్‌కి నచ్చేలా ఉన్నాకానీ పాడుకునేంత క్యాచీగా లేవు అన్న కామెంట్స్ పవన్ అభిమానుల వర్గం నుంచి కూడ వస్తోంది. 

అంతేకాదు మ్యూజిక్ టేస్ట్ ఉన్నవారికి ఈ పాటలు నచ్చుతాయి కానీ సాధారణ ప్రేక్షకులకు ఈమూవీలోని పాటలు ఎంతవరకు కనెక్ట్ అవుతాయి అన్న విషయమై పవన్ అభిమానులలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’  ‘అత్తారింటికి దారేది’ చిత్రాలకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం పెద్ద ప్లస్‌ అయింది. అన్ని వర్గాలని అలరించే పాటలతో దేవిశ్రీ ఆమూవీలకు ట్యూన్స్ అందించి ఆమూవీల ఆడియోలను బ్రహ్మాండమైన హిట్‌ చేసాడు. కానీ అనిరుధ్‌ ది డిఫరెంట్‌ బాణీ కావడంతో పవన్ ఇమేజ్ కి అనుగుణంగా కాకుండా తనకి నచ్చిన స్టయిల్లో మ్యూజిక్‌ చేసాడా అన్న సందేహాలను పవన్ అభిమానులలోని ఒక వర్గం వ్యక్త పరుస్తోంది. 

పవన్ సినిమాలకు ఆయువు పట్టులా నిలిచే మాస్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకోకపోతే ‘అజ్ఞాతవాసి’ కి కష్టం కదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇంతవరకు విడుదలైన ఈ రెండు పాటలే కాకుండా మిగిలిన నాలుగు పాటలు కూడా ఇదే రీతిన ఉంటాయని టాక్‌ వినిపిస్తోంది. మరి అన్ని పాటలు ఇంత స్లోగా ఉంటే పవన్‌ సినిమా మాస్‌ జనాల్లోకి వెళ్ళగలుగుతుందా అన్న అనుమానాలు కూడ కొందరికి ఉన్నాయి. 

ఇది ఇలా ఉండగా ఈమూవీ ఆడియో ఫంక్షన్ వచ్చే వారం జరుగుతున్న నేపధ్యంలో ఈలోగా ఈమూవీకి మరింత హైక్ తీసుకురావడానికి చిన్న టీజర్‌ ఒకటి విడుదల చేస్తారట. మరో మూడు రోజుల్లో పవన్‌ డాన్స్‌ బిట్‌ కు సంబంధించిన క్లిప్‌ ఒకటి విడుదల కానుందని సమాచారం. ఏమైనా అనిరుద్ ‘అజ్ఞాతవాసి’ ఆడియోను హిట్ చేయలేకపోతే పవన్ అభిమానుల అసహనానికి గురికావడం ఖాయం..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: