టాలీవుడ్ యంగ్ హీరోలలో సినిమాలు చేసుకుంటూ సినిమాలతోనే కాకుండా బిజినెస్ లలో కూడా మంచి లాభాలను అందుకుంటున్న యంగ్ హీరోల లిస్టులో రామ్ చరణ్ మొదటి వరసలో ఉంటాడు. ప్రస్తుతం అతడు రకరకాల వ్యాపారాలు చేస్తూ సక్సస్ ను అందుకుంటున్న నేపధ్యం తెలిసిందే. డొమెస్టిక్ లెవల్లో ట్రూజెట్ ఎయిర్ లైన్స్ ని నడుపుతున్న మెగా పవర్ స్టార్ చరన ఆతర్వాత కొద్దికాలానికే సినిమా ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తాడు. 

తన తండ్రిని రీ-లాంచ్ చేస్తూ సొంత ప్రొడక్షన్ లో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీని తీసి రికార్డు స్థాయిలో లాభాలు పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవితో ‘సైరా’ ను నిర్మిస్తూ మరిన్ని భారీ లాభాల పై కన్ను వేసాడు. ఇది చాలదు అన్నట్లుగా చరణ్  క్రీడా వ్యాపారంలో కూడ ప్రవేసించి ఫూట్ బాల్ కబడ్డీ లాంటి క్రీడలకు సంబంధించిన టీమ్స్ ను కొనుగోలు చేస్తూ స్పోర్ట్స్ రంగంలో కూడ తన సత్తాను చాటుతున్నాడు. 

అయితే ఇవి చాలదు అన్నట్లుగా చరణ్ కొత్తగా ప్రారంభించ బోతున్న మరొక వ్యాపారం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలోనే చరణ్ తెలంగాణ ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో థియేటర్స్ ని కొనుక్కుంటాడట. దీనికి కారణం బడా నిర్మాతలు చాలా వరకు థియేటర్స్ ని వారి ఆధీనంలో ఉంచుకుని కొన్ని చిన్న సినిమాలకు థియేటర్స్ దక్కనివ్వకుండా చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు చరణ్ కూడ ధియేటర్స్ బిజినెస్ లోకి వచ్చి మంచి చిన్న సినిమాలను తానే కొని తన సొంత ధియేటర్లలో విడుదల చేసే మాస్టర్ ప్లాన్ లో ఉన్నట్లు టాక్. 

ఈ న్యూస్ కు సంబంధించి మరొక ట్విస్ట్ ఈవ్యాపారంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ చరణ్ కలిసి ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు టాక్. ఈ అనుబంధం వల్లనే కాబోలు చరణ్ నటించిన ‘రంగస్థలం’ హక్కులను యూవీ సంస్థ నైజాం ఏరియాకు 18 కోట్లకుకొనుక్కుంది అన్న వార్తలు ఉన్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: