సినిమా క్రిటిక్ గా కత్తి మహేష్ సాధించిన పాపులారిటీ కన్నా పవన్ విమర్శకుడుగా మహేష్ పొందిన గుర్తింపు చాల ఎక్కువ. ఇంచుమించు  ప్రతిరోజు పవన్ నామస్మరణతో పాటు పవర్ స్టార్ పై అదేవిధంగా అతడి అభిమానుల పై సెటైర్లు వేయకుండా కత్తి మహేష్ రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. 

ఇలాంటి పరిస్థుతులలో ఈవివాదాలకు మరింత మసాలను కలిపి అన్ని ప్రముఖ ఛానల్స్ కత్తి మహేష్ తో ఇంటర్వ్యూలు చేస్తూ అతడి పాపులారిటీని ఈమధ్య విపరీతంగా పెంచేసాయి. దీనితో మహేష్ తనకు కొత్తగా ఏర్పడ్డ ఈ పాపులారిటీని క్యాష్ గా మార్చుకోవడానికి ఒక మాస్టర్ స్కెచ్ వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారంమేరకు మహేష్ ఒక పొలిటికల్ సెటైర్ సినిమాను తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడ పూర్తి అయింది అని అంటున్నారు. ప్రస్తుతం భారతదేశంలోని నీచ రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఈసినిమా ఉంటుంది అని టాక్. 

ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు లీక్ కావడంతో కొందరు మహేష్ పై సెటైర్లు వేస్తున్నారు. కత్తి తీయబోతున్న సినిమా నీచరాజకీయాల పైనా ? లేదంటే పవన్ టార్గెట్ చేస్తూ మహేష్ తీయబోతున్న పొలిటికల్ సెటైర్ గా ఉంటుందా ? అంటూ ఘాటైన కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరైతే ‘పెసరట్టు’ సినిమాను తీసి ఘోరంగా ఫెయిల్ అయిన మహేష్ మరొకసారి మరో ఫెయిల్యూర్ ప్రయోగం చేయబోతున్నాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈకామెంట్స్ ఎలా ఉన్నా మహేష్ తీయబోయే సినిమాలో పవన్ పై సెటైర్లు ఉంటాయి కాబట్టి ఈసినిమాకు బిజినెస్ బాగానే జరిగి పవన్ వల్ల ఆర్ధికంగా కత్తి మహేష్ కు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: