పవన్ కల్యాణ్ వ్యాఖ్యల పై ఒకనాటి హీరోయిన్ ఎమ్మెల్యే రోజా స్పందించిన తీరు అత్యంత వివాదాస్పధంగా ఉండటంతో ఆమె కామెంట్స్ ను హైలెట్ చేస్తూ ఇప్పటికీ అనేక ప్రముఖ ఛానల్స్ చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపధ్యంలో రోజా మాటలు సంచలనంగా మారి పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి.ఈకామెంట్స్ మాటల యుద్దంగా మారిన నేపధ్యంలో దీనిప్రభావం నాగబాబు, రోజా నిర్వహించే ‘జబర్దస్త్’ కామెడీ షోపై ఉండబోతోంది అన్నమాటలు వినిపిస్తున్నాయి. 

ఈపరిస్థితుల నేపథ్యంలో రోజా వ్యాఖ్యల పై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా రోజాకు తగిన బుద్ధి చెప్పాలి అనిఅంటూ పవన్ ఫ్యాన్స్ మండిపడుతూ నాగబాబు పై ఒత్తిడి పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘జబర్దస్త్’ కార్యక్రమంలో ఆర్టిస్టులు వేసే జోకులకు రోజా నాగబాబు పడీపడీ నవ్వుకుంటారు. అయితే ఇప్పుడు రోజా పవన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన నేపధ్యంలో నాగబాబు రోజాతో కలిపి ‘జబర్దస్త్’ షోలో ఉల్లాసంగా ఎలా నవ్వగలుగుతాడు అని పవన్ అభిమానులు నాగబాబుకు ప్రశ్నలు వేస్తున్నారు. 

ఈపరిస్తుతులలో నాగబాబు రోజాతో కలిసి ‘జబర్దస్త్’ కార్యక్రమంలో పాల్గొనడం సరైంది కాదు అనిఅంటూ నాగబాబుకు పవన్ అభిమానులు తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నట్లు టాక్. అంతేకాదు ‘జబర్దస్త్’ కామెడీ షోనుంచి రోజాను తొలగించాలి. లేదా ఈకార్యక్రమం నుంచి నాగబాబు తప్పుకోవాలని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ‘జనసేన’ రానున్న రోజులలో మరింత దూసుకుపోవడం ఖాయం కాబట్టి రోజా తన వ్యాఖ్యల వేడిని మరింత పెంచుతుంది కాబట్టి నాగబాబు ముందే మేల్కొనాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయాన్ని పవన్ అభిమానులు వ్యక్త పరుస్తున్నారు.  

దీనితో ప్రస్తుతం నాగబాబు పవన్, రోజాల ఎపిసోడ్ మధ్య నలిగిపోవడం ఖాయం అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ అభిమానులలో ఒకవర్గం నాగబాబును వ్యక్తిగతంగా కలిసి తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపధ్యంలో పవన్ అభిమానుల మాటలు విని నాగబాబు కార్నర్ అయ్యాడు అని వార్తలు వస్తున్నాయి. దీనితో నాగబాబు రోజా వ్యాఖ్యల పై రియాక్ట్ అవుతాడా లేదంటే రాజకీయాలు వేరు, వినోదం వేరు అంటూ తెలివిగా సమాధానం చెప్పి ఈసున్నిత సమస్య నుండి బయటపడతాడా ? అన్న విషయం పై రకరకాల అభిప్రాయలు వినపడుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: