మెగాస్టార్ చిరంజీవి ఎంతటి గంభీరమైన డైలాగులను అయినా చాలచక్కగా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా చెపుతాడు. అందువల్లనే చిరంజీవి 150 సినిమాలలో నటించి ఇప్పటికీ మెగాస్టార్ గా కోట్లాదిమంది అభిమానులను కొనసాగించుకోగలుగుతున్నాడు. ఇలాంటి నేపధ్యంలో ఈమధ్య చిరంజీవి గొంతు పై వచ్చిన కొన్ని కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరిచాయి.

 

‘ఖైదీ నంబర్ 150’ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అందులో చిరు లుక్ కూడా బాగున్నప్పటికీ కొన్నివిషయాలు కొంత ఇబ్బందిగా అనిపించాయి అని అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా చిరంజీవి మునుపటి స్థాయిలో చురుగ్గా కనిపించలేదు కొంచెం డల్లయ్యాడు అంటూ మరోవైపు ఆయన వాయిస్ కొంచెం తేడాగా అనిపించింది అన్నకామెంట్స్ అప్పట్లో కొందరు విమర్శకులు చేసారు. దీనికికారణం ‘పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది’ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ లో మెగా స్టార్ స్థాయిలో ఫోర్స్ లేదు అన్న కామెంట్స్ కూడ అప్పట్లో వచ్చాయి.

 

దాదాపు దశాబ్దం పాటు చిరు సినిమాలకు దూరంగా ఉండటంతో వయసు కొంచెం మీద పడటంతో ఆయన వాయిస్ లో తేడా వచ్చిందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేసారు. అయితే ఆవిమర్శలు చిరంజీవి దృష్టివరకు వెళ్ళినట్లున్నాయి ఆవిమర్శలకు సమాధానాలు ఇచ్చేవిధంగా చిరంజీవి తన వాయిస్ కల్చర్ ను మార్చుకున్నాడు అని అనిపిస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో తన లుక్ విషయంలోనే కాకుండా ఫెరోషియస్ క్యారెక్టర్ అయిన నరసింహారెడ్డి పాత్రకోసం తాను చాల కసరత్తులు చేస్తున్న సంకేతాలు చిరంజీవి తన లుక్ లోనే కాకుండా తన వాయిస్ లో కూడ ఇస్తున్నాడు.


 ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే చిరు ఏం మ్యాజిక్ చేశారో తెలియదు కానీ లేటెస్ట్ గా జరిగిన ‘తెర వెనుక దాసరి’ పుస్తకావిష్కరణ సభలో చిరంజీవి ప్రసంగం వింటే ఆయన వాయిస్ లో వచ్చినమార్పు స్పష్టంగా కనిపిస్తోంది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈఫంక్షన్ లో చిరంజీవి దాదాపు పావుగంట పాటు అనర్గళంగా మాట్లాడటమే కాకుండా ఆయన వాయిస్ చాలా గంభీరంగా వినిపించింది అన్నకామెంట్స్ వస్తున్నాయి. ఎక్కడా తడబాటు లేకుండా లో పిచ్ లో మాట్లాడినా కూడా వాయిస్ బలంగా వినిపించింది మాటలో ఫోర్స్ కనిపించింది. దీనితో ‘సైరా’ సినిమాకోసం ప్రిపరేషన్లో భాగంగా చిరు వాయిస్ మీద కూడా దృష్టిపెట్టి కసరత్తులేమైనా చేశారా లేదా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా అంటూ చిరంజీవి వాయిస్ లో వచ్చినమార్పు పై కొందరు తమలో తాము కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: