కోట్లాదిమంది అభిమానులను పొందిన మెగాస్టార్ చిరంజీవిని ప్రస్తుతతరం ఏహీరోలతోను పోల్చే సాహసం ఎవరు చేయలేరు. అయితే అనుకోకుండా సునీల్ నేచురల్ స్టార్ నానీని మెగా స్టార్ చిరంజీవితో పోలుస్తూ చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు మాత్రమే కాకుండా చాలామందికి షాక్ ఇస్తున్నాయి.

నాకు దిలీప్ సినిమాలు బాగా సూటవుతాయి: సునీల్

 ఆసక్తికరమైన ఈసంఘటన ఒక ఫిలిం ఫంక్షన్ లో జరిగింది. సునీల్ మ‌నీషా రాజ్ లు జంట‌గా న‌టిస్తున్న ‘2 కంట్రీస్‌’ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ మొన్న హైదరాబాద్ లో జరిగింది. ఈఫంక్షన్ కు హీరో నాని ముఖ్యఅతిధిగా వచ్చాడు. ఈసందర్భంగా నాని మాట్లాడుతూ తనకు సునీల్ అన్న అంటే చాలా ఇష్టం అని చెపుతూ ‘ఢీ' సినిమాకు తనను అసిస్టెంట్ డైరెక్టర్‌గా రికమండ్ చేసింది సునీల్  మాత్రమే అంటూ ఆస్థాయి నుంచి నేటి హీరోస్థాయికి ఎదగడానికి సునీల్ లాంటివారు ఎంతగానో సహకరించారు అంటూ కామెంట్స్ చేసాడు.

 చిరంజీవిగారి తర్వాత నాని వచ్చాడు

 నానీ నోటివెంట ఈపొగడ్తలు విన్న సునీల్ తమ స్పీచ్ లో మరింత రెచ్చిపోతూ తాను గతంలో ‘జక్కన్న’ సినిమా చేసినప్పుడు ఆసినిమా ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి తన ‘ఖైదీ నెంబర్ 150’ లో బిజీగా ఉన్నా ఆషూటింగ్ ను బ్రేక్ చేసుకుని తన సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చిన సంగతిని గుర్తుకు చేసుకుంటూ ఇప్పుడు నానీ కూడ అదేవిధంగా తన సినిమా షూటింగ్ ను బ్రేక్ చేసుకుని ‘2 కంట్రీస్’ ఆడియో ఫంక్షన్ కు వచ్చాడని కామెంట్స్ చేసాడు. దీనితో సునీల్ నోట ఈకామెంట్స్ విన్నవారు సునీల్ నానీని చిరంజీవితో పోలుస్తూ కామెంట్స్ చేసాడా ? అంటూ ఆ ఫంక్షన్ లోని కొందరు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.

బండ్ల గణేష్ కొన్నాడు, కానీ చివరకు నాకే వచ్చింది

 ఇదే సందర్భంలో సునీల్ మాట్లాడుతూ ఈమూవీ ఫస్ట్ టీజర్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన నేపధ్యంలో పవన్ గోల్డెన్ హ్యాండ్ తనకు కలిసి వస్తుంది అంటూ పవన్ పై కూడ ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు పవన్ విడుదలచేసిన తన సినిమా టీజర్ ను యూట్యూబ్ లో 40 ల‌క్ష‌ల మంది చూసిన నేపధ్యంలో ఈసినిమా పవన్ హస్త వాసితో హిట్ కావడం ఖాయం అని అంటున్నాడు సునీల్..

 





మరింత సమాచారం తెలుసుకోండి: