తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న తమిళ హీరో విజయ్ రీసెంట్ గా ‘మెర్సల్’ తెలుగు లో అదిరింది తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించింది విజయ్ అనే చెప్పొచ్చు.  తాజాగా విజయ్ కి ఓ అరుదైన గౌరవం దక్కింది. సీబీఎస్ఈ మూడవ తరగతి పాఠ్యపుస్తకంలో విజయ్ ఫొటోను పొందుపరిచారు.  సాధారణంగా తమిళ సంప్రదాయానికి అద్దం పట్టేలా పురుషులు ధోవతి, ఆఫ్ చొక్కా ధరిస్తుంటారు. 
Related image
సామాన్యుల  నుంచి సెలబ్రెటీల వరకు ఈ సాంప్రదాయాన్నే ఎక్కువ పాటిస్తుంటారు.  ఈ నేపథ్యంలో తమిళనాడులో పురుషుల డ్రెస్సింగ్  స్టైల్ ను విద్యార్థులకు తెలియజెప్పే నిమిత్తం  పంచె, చొక్కా ధరించి ఉన్న విజయ్ ఫొటోను ఈ పాఠ్య పుస్తకంలో పొందుపరిచారు.  అంతే కాదు తమిళనాడులో ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ ‘పొంగల్’అని,  రైతుల పండగ అని, జనవరి నెలలో మూడు రోజుల పాటు ఈ పండగను నిర్వహిస్తారని ఆ పుస్తకంలో రాశారు.
Related image
ఈ మద్య విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రంలో ఎయిర్ పోర్ట్ లో ఈ తరహా సాంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లడం..అక్కడ గార్డులు అతనిని  అవమానించేందుకు ప్రయత్నించగా..విజయ్ గొప్ప డాక్టర్ అని తెలిసిన తర్వాత వారు  మాపణలు చెప్పడం విజయ్ ని గౌరవించడం ఈ సన్నివేశంలో జరుగుతుంది. తమిళ సంప్రదాయానికి గౌరవాన్ని తీసుకువచ్చిన విజయ్ ఫొటోను సీబీఎస్ఈ పాఠ్యపుస్తకంలో పొందుపరచడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: