తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన ఘనత రాజమౌళికే దక్కుతుంది.  స్టూడెంట్ నెం.1 చిత్రంతో వెండితెరపై తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన రాజమౌళి రీసెంట్ గా ‘బాహుబలి2’తో ప్రభంజనం సృష్టించారు.  అప్పటి వరకు ఫ్యామిలీ, ఎంట్రటైన్ మెంట్ గా ఉన్న ఆయన సినిమాలు ‘ఈగ’ తర్వాత గ్రాఫిక్స్ తో మాయాజాలం సృష్టించడం మొదలు పెట్టారు.  ఇక బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ఏకంగా భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించాడు. 
Image result for rajamouli eega
ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ గౌరవం కూడా ప్రపంచ స్థాయిలో తెలిసిపోయింది.  భారతీ చిత్రాల్లో అత్యధికంగా వసూళ్లు చేసిన చిత్రంగా ‘బాహుబలి 2’ రికార్డు స్థాపించింది.   రాజ‌మౌళి రూపొందించిన `బాహుబ‌లి: ది కంక్లూజ‌న్‌` దేశ సినీ చ‌రిత్ర‌లోనే ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ ఏడాది విడుద‌లైన ఆ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన రెండో భార‌తీయ సినిమా (మొద‌టిది `దంగ‌ల్‌`)గా నిలిచింది.
Image result for rajamouli baahubali 2
అంత గొప్ప దర్శకుడికి ఓ సినిమా నచ్చిందట..ఇంతకీ ఆ సినిమా ఏదీ అనుకుంటున్నారా..?సందీప్ డైరెక్ష‌న్‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, షాలినీ పాండే న‌టించిన `అర్జున్‌రెడ్డి`.  ఈ సంవత్సరం చిన్న బడ్జెట్ తో చిన్న సినిమాగా తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ కి ముందు నుంచే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చింది. 
Image result for arjun reddy
ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లలో దుమ్మురేపింది.  ఇటీవ‌లి ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి వెల్ల‌డించారు. 2017లో `అర్జున్‌రెడ్డి` త‌న ఫేవ‌రెట్ చిత్ర‌మ‌ని ఆ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. సినిమా విడుద‌లైనపుడు కూడా రాజ‌మౌళి ట్విట‌ర్ ద్వారా చిత్ర‌బృందాన్ని అభినందించిన విష‌యం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: