గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్‌ గురించి కామెంట్స్ చేయడం మానుకుని మౌనంలో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తిరిగి తన మౌనం వీడి పవన్ పై చేసిన లేటెస్ట్ కామెంట్స్ సంచలనంగా మారడమే కాకుండా ఈ కామెంట్స్ వెనుక అర్ధాలు ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడూ విమర్శలతో పవన్ ను టార్గెట్ చేసే వర్మ ఈసారి పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్ చేసాడు.

 పాఠం నేర్చుకున్నా

ఇప్పుడే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ స్పీచ్ చూశానని ఎంతో థ్రిల్ కు గురయ్యానని అంటూ పవన్ తన పై రూమర్ల గురించి స్పందించిన విధానం అద్భుతం అంటూ కామెంట్ చేసాడు. ఈవిషయంలో తనకు పవన్ లోని నిజాయితీ నచ్చిందని అంటూ ఏమాత్రం సిగ్గు పడకుండా ఏ విషయాలను దాచకుండా పవన్ వ్యవహరించిన తీరు తనకు ఎంతో నచ్చింది అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు.

  పవన్ అస్సలు సిగ్గు పడలేదు

కేవలం గడిచిన అంశాలపైనే కాకుండా భవిష్యత్ మీద కూడా పవన్ కు పూర్తి క్లారిటీ ఉందని వ్యాఖ్యానించాడు. అయితే తాను గతంలో పవన్ పై తొందరపడి పలు వ్యాఖ్యలు చేశానని ఇది తనకొక గుణపాఠమని వర్మ తన ఫేస్ బుక్ లో కామెంట్స్ పెట్టాడు. అంతేకాదు పవన్ భవిష్యత్ లో పవన్ గొప్ప నాయకుడు అవుతాడు అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు.

 పవన్ స్పీచ్ చూసి థ్రిల్లయ్యాను

 దీనితో వర్మ చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరగడమే కాకుండా అన్న మాట పై ఎప్పుడూ నిలబడని వర్మ పవన్ పై కురిపించిన ప్రశంసలను ఎంతకాలం కొనసాగిస్తాడు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికితోడు వర్మ ఇలా భావయుక్తంగా పవన్ పై ప్రేమను కురిపించడం పవన్ అభిమానులకు కూడా నమ్మలేని విధంగా మారింది.. 


 


మరింత సమాచారం తెలుసుకోండి: