నిన్న అత్యంత అట్టహాసంగా ప్రారంభం అయిన ప్రపంచ తెలుగు మహాసభలలో ఎందరో ప్రముఖుల ఛాయా చిత్రాలను వారి పేర్లతో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడంతో తెలుగుప్రజలు మరిచిపోయిన ఎందరో ప్రముఖులను గుర్తుకు చేసే సభలుగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలు మారాయి. అయితే తెలుగుజాతి పౌరుషాన్ని దేశానికి తెలియ చెప్పేలా వ్యవహరించిన ‘నందమూరి తారకరామారావు’ పేరిట ఒక స్వాగత ద్వారం కూడ పెట్టకపోవడంతో పాటు ఎక్కడా ఎన్టీఆర్ ఫోటోను కూడ ఎదో ఒక విభాగంలో పెట్టక పోవడంతో కనీసం ఎన్టీఆర్ కు ఈ కనీసగౌరవం కూడ ఇచ్చే స్థాయి కూడ లేదా ? అంటూ ఎన్టీఆర్ అభిమానులు తమ తీవ్ర ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు.

 

ఈ ఆవేదనలో ఎంతోకొంత వాస్తవం ఉంది అని అనిపిస్తోంది. రాజకీయాలను పక్కకు పెడితే ఇప్పటికీ తెలుగు ప్రజల హృదయాలలో శాశ్విత స్థానం సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. ఆయనతో పాటు తెలుగు సినిమా ప్రతిష్టను పెంచడంలో అక్కినేనికి కూడ ఎంతో స్థానం ఉంది.


 అయితే వీరిద్దరి ఫోటోలతో పాటు తెలుగు సంస్కృతికి కళలకు సేవలు చేసిన ఎందరో ప్రముఖులను ఈ ప్రపంచ తెలుగు మహాసభలు మరిచిపోయాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సభలలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అతిధిగా నాగార్జునను పిలిచినా నందమూరి కుటుంబాన్ని మరిచిపోవడం ఏమిటి అంటూ నందమూరి అభిమానులు తమ తీవ్ర ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు.


 ఇది ఇలా ఉండగా నిన్న ప్రారంభం అయిన ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి హోదాలో కె సి ఆర్ చేసిన ఉపన్యాసం ఈ సభలకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. సాహిత్యం పట్ల అభిమానం ఉన్న కెసిఆర్ నోటివెంట అలవోకగా సుమతీ శతకం వేమన శతకం లోని పద్యాలు దూసుకురావడంతో ఆ కార్యక్రమానికి వచ్చిన వేలాదిమంది కేసిఆర్ పాండిత్య ప్రతిభకు ఆశ్చర్యపోయారు. తెలుగు ప్రజలు అంతా అమ్మ భాషకు పునరంకితం కావాలి అని పిలుపును ఇచ్చిన ఈ అంబరాన్ని అంటిన సంబరం తరువాత అయినా తెలుగు వెలుగులకు విలువ ఏర్పడుతుందనే ఆశిద్దాం..

 


మరింత సమాచారం తెలుసుకోండి: