సినీనటుడు తెలుగు కమీడియన్ విజయ్ ఆత్మహత్య కేసు లో రోజుకో  సంచలన కరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విజయ్ భార్య అయినా వనిత, విజయ్ కు పంపిన ఆడియో క్లిప్స్ వెలుగులోకి వచ్చింది ‘నాకు ఎంత ఈగో రేజ్‌ అవ్వాలి. విజయ్‌ నీకు అలాంటివేమి ఉండవనుకుంటా.. నాకు చాలా ఎక్కువ. ఒక్కసారి నా ఈగో రెచ్చగొడితే అది లైఫ్‌ లాంగ్‌ బ్లడ్‌లో అలా ఉండిపోతుందంతే. నీకు తెలియదు కదా నా గురించి చూడు రివేంజ్ ఎలా ఉంటుందో.

రివేంజ్ తీర్చుకోకుండా ఉండను. ఎందుకంటే నేను సైలెంట్‌గా ఉండను. నేను ఇంతవరకు ఎంత దిగజారానో నాకు తెలుసు. అర్థమైందా? నేను మళ్లీ ఎలా బతుకుతానో నువ్వు చూద్దువు గాని బాధపడకు, కంగారు పడకు సరేనా?’ అంటూ వనిత మాట్లాడిన మాటలు ఆడియోలో ఉన్నాయి.

విజయ్ కూడా  తానూ  ఆత్మహత్య చేసుకునేముందు తీసుకున్న సెల్ఫి వీడియోలో  వనితతో పాటు తన చావుకు కారణం ఐన ఎవరినీ వదలకు నాన్న ..అందరికీ శిక్ష పడేలా చూడు అని చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో విజయ్ అంత్యక్రియలు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విజయ్ భార్య వనిత ఇప్పటివరకు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి, అజ్ఞాతంలోకి వెళ్లిన వనితను పట్ల పోలీసులు ఎటువంటి ఆక్షన్ తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అలాగే కన్న కొడుకును పోగొట్టుకున్న తండ్రి సుబ్బారావు  వనితను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని తన  ఆవేదన వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: